March 28, 2026

పవన్ కళ్యాణ్ సమక్షంలో వరుణ్ తేజ్ ‘బరి’ గ్రాండ్ స్టార్ట్…

bari_with_logo2

మెగా ఫ్యామిలీ హీరోగా ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్, కమర్షియల్ విజయాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నాడు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నాడు.

ఇప్పుడాయన ‘బరి’ అనే కొత్త ప్రాజెక్ట్‌తో బరిలోకి దిగుతున్నాడు. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై టీమ్‌కు ఆశీస్సులు అందించారు.

ఈ ప్రాజెక్ట్‌కు మరో స్పెషల్ ఏమిటంటే, వరుణ్ తేజ్ సిస్టర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోంది. ‘కమిటీ కుర్రాళ్లు’తో మంచి పేరు తెచ్చుకున్న ఆమె, ఈసారి మరింత భారీ స్థాయిలో సినిమాను నిర్మించడానికి సిద్ధమైంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading