మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి – కవిత!

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఎంత ముఖ్యమో, అదే విధంగా ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కూడా అవసరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.
ఓబీసీ మహిళలకు ఉప కోటా ఇవ్వకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అది మెజారిటీ ప్రజలకు అన్యాయం చేసినట్లే అవుతుందని కవిత విమర్శించారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే మహిళా రిజర్వేషన్ల బిల్లు పూర్తిగా ఉపయోగం ఉండదని అన్నారు.
మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే తెలంగాణ జాగృతి తరఫున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగితేనే నిజమైన సామాజిక సమానత్వం సాధ్యమని కవిత స్పష్టం చేశారు
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
