పెద్ది’ రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చ.. SKN వివరణ…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ విడుదలపై నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్లో మాట్లాడిన SKN, పొరపాటున ‘పెద్ది’ సినిమా జూన్ 26న విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో వెంటనే స్పందించిన ఆయన, ఇది పూర్తిగా మిస్ కమ్యూనికేషన్ మాత్రమేనని స్పష్టం చేశారు. తాను తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడానని చెబుతూ క్షమాపణలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు.ఇక ‘పెద్ది’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించి, ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు.అయితే, ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి పోస్ట్‌పోన్ అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో SKN చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
