AI ప్రభావం.. ఒరాకిల్ భారీ లేఆఫ్స్

అమెరికా టెక్ దిగ్గజం Oracle భారీ లేఆఫ్స్ ప్రకటిస్తూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఏఐ ఆధారిత పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌పై కూడా తీవ్రంగా పడింది. ఇక్కడే దాదాపు 12 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. చాలా మందికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఉదయం వేళల్లో ఇమెయిల్ ద్వారా టెర్మినేషన్ లెటర్స్ పంపినట్లు నివేదికలు చెబుతున్నాయి.
కంపెనీ కార్యకలాపాల్లో AI వినియోగాన్ని పెంచడం, ఖర్చులను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే Amazon, Meta, Microsoft వంటి సంస్థలు కూడా ఇలాంటి లేఆఫ్స్ చేపట్టిన విషయం తెలిసిందే.
టెక్ రంగంలో ఈ పరిణామాలు ఉద్యోగ భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
