ఆడుకుంటూ అదృశ్యమైన 5 ఏళ్ల బాలిక.. మూడు రోజల తర్వాత చెరకు తోటలో మృతదేహం లభ్యం.. తలపై బలమైన గాయాలు

5-year-old-girl-dead-found

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. డియోరియాలోని తార్కుల్వాలో 5 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మరణించింది. బాలిక మరణంతో ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. మూడు రోజుల క్రితం ఆడుకుంటూ ఆ బాలిక అదృశ్యమైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన బాలిక మృతదేహం చెరకు తోటలో కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్‌ డియోరియా జిల్లాలోని తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బార్వా సమేరా గ్రామానికి చెందిన 5 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటోంది. అలా ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యమైంది. బాలిక కుటుంబ సభ్యులు రాత్రి పొద్దుపోయే వరకు వెతికారు.. అయినా ఎక్కడా బాలిక జాడ కనిపించలేదు. తరువాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. చెరకు తోటలో అనుమానాస్పద స్థితిలో తప్పిపోయిన బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మూడు రోజుల క్రితం తన ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ళ బాలిక అకస్మాత్తుగా అదృశ్యమైంది. రాత్రి పొద్దుపోయినా బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు బాలిక కోసం వెదికారు. ఎక్కడా బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసు బృందాలు గ్రామస్తుల సహాయంతో, డాగ్ స్క్వాడ్‌లు, డ్రోన్‌లను ఉపయోగించి బాలిక ను వెదకడం మొదలు పెట్టాయి. చివరకు మూడు రోజుల తర్వాత చెరకు తోటలో మృత దేహం కనిపించింది.

చనిపోయిన బాలిక తండ్రి తన కూతురు తన స్నేహితులతో ఆడుకుంటోందని చెప్పాడు. మిగతా బాలికలు ఇంటికి వెళ్ళారు.. కానీ తన కూతురు తిరిగి రాలేదు. సాయంత్రం 7 గంటల నుంచి వెతకడం ప్రారంభించాము, ఎక్కడా కనిపించలేదు. చివరకు మూడు రోజుల తర్వాత తన కూతురు మృతదేహం చెరకు తోటలో కనిపించిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పాడు. తన కూతురు తలపై గాయం ఉందని.. చంపేసిన తర్వాత పొలంలో శవాన్ని విసిరివేశారని.. తనకు న్యాయం చేయమని బాలిక తండ్రి విజ్ఞప్తి చేశాడు. తన కూతురుపై సామూహిక అత్యాచారం జరిగిందని అనుమానిస్తున్నాడు. అంతేకాదు ఈ దారుణానికి కారణం నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

బిజెపి నాయకుడు జితేంద్ర రావు మాట్లాడుతూ.. “ఒక 5 ఏళ్ల బాలిక , మరికొందరు పిల్లలు దాగుడుమూతలు ఆడుకుంటున్నట్లు తనకు సమాచారం అందింది. ఆ తర్వాత దాక్కున్న బాలిక అదృశ్యమైంది. ఇంటికి తిరిగి రాలేదు. గ్రామస్తులు ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేశారు. దీనికి ఎవరో ఒకరు ఖచ్చితంగా బాధ్యులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు.”

దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు

ఈ సమాచారం అందిన వెంటనే పోలీసు స్టేషన్ నుంచి బృందాలుగా బయలుదేరి గ్రామస్తులు, డాగ్ స్క్వాడ్,యు డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించాయి. తప్పిపోయిన బాలిక తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా తగిన సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఉదయం పోలీసు సిబ్బంది , గ్రామస్తులు సమన్వయంతో నిర్వహించిన గాలింపు చర్యలో బాలిక మృతదేహం చెరకు తోటలో కనుగొనబడింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights