సృష్టి రహస్యాన్ని ఆ ప్రాణి తిరగ రాసింది..

ఔను.. సృష్టి రహస్యాన్ని ఆ ప్రాణి తిరగ రాసింది. ఏదో పాత పాట లో చెప్పినట్టు “తల్లితండ్రి ఒకరినొకరు తాకనిచో.. నీవు లేవు.. నేను లేను.. ఈ జగమే లేదులే.. “అనే ఈ పాటను మీరు వినే ఉంటారు.సృష్టి రహస్యాన్ని వివరిస్తూ పాటను రాశారా రచయిత. 👉మనుషులయినా, జంతువులయినా.. ఏదైనా ఓ ప్రాణికి జన్మనివ్వాలంటే స్త్రీ, పురుష జీవుల కలయిక జరగాల్సిందే.
🔴ప్రపంచంలో మొట్టమొదటిసారి: ఈ రూల్ ని అధిగమించి స్త్రీ, పురుషుల కలయిక జరగకుండా ఒక జీవి జన్మించింది. ఓ ఆడ జీవి.. కన్యగానే ఉండి మరో జీవికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ ఆడ జీవి మనిషి కాదులేండి. 👉ఒక పాము. అవును.. ఓ ఆడ అనకొండ సంభోగంలో పాల్గొనకుండానే గర్భం దాల్చి రెండు అడుగుల సైజు ఉన్న రెండు పాములకు జన్మనిచ్చింది. 🔹అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఈ వింత చోటుచేసుకుంది. పది అడుగుల ఆడ అనకొండ పురుష పాముతో కలవకుండానే రెండు పిల్లలకు జన్మనిచ్చిందని న్యూ ఇంగ్లాండ్ ఆక్వేరియమ్ వెల్లడించింది. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా తమకు ఈ విషయం తెలిసినట్టు బోస్టన్ ఆక్వేరియమ్ మీడియాకు తెలిపింది. మొత్తం మూడు పిల్లలు పుట్టగా.. ఒక పిల్ల అనకొండ చనిపోయినట్టు పేర్కొన్నారు. జనవరిలో ఈ ఆడ అనకొండ పిల్లలకు జన్మనిచ్చిందని.. సంభోగం జరగకుండా పిల్లలు పుట్టినట్టు ధ్రువీకరించడానికి తమకు ఇన్ని నెలల సమయం పట్టినట్టు ఆక్వేరియమ్ సిబ్బంది తెలిపింది. కాగా, సంభోగం జరగకుండా పునరుత్పత్తి అనేది బల్లులలో, తిమింగళాల్లో, అనేక పక్షుల్లో, పాముల్లో ఇంతకుముందు కూడా జరిగినట్టు ఆక్వేరియమ్ సభ్యులు స్పష్టం చేశారు.
