సోషల్ మీడియా స్టార్ మోనాలిసా వివాహం వివాదంలో… మైనర్ అని తేలడంతో కేసు

కుంభమేళాలో ఒక్క ఫోటోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిన గిరిజన యువతి మోనాలిసా ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రేమ వివాహం చట్టపరమైన సమస్యల్లో పడటంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.సహజమైన అందంతో వైరల్ అయిన మోనాలిసా, అనంతరం ఫర్మన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహంపై అనుమానాలు వ్యక్తమవడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో కీలక విషయం బయటపడింది. ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించినట్లు తేలింది. అంటే వివాహం జరిగిన సమయంలో ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలే.దీంతో ఆమె మైనర్ అని నిర్ధారించడంతో, భర్త ఫర్మన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ పరిణామం కేసును మరింత సీరియస్ దశకు తీసుకెళ్లింది.ఇక దర్యాప్తులో మరో సంచలన అంశం బయటపడింది. వివాహం జరిపించేందుకు మోనాలిసా పుట్టిన తేదీని మార్చుతూ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. తప్పుడు పత్రాల ఆధారంగా కేరళలో ఆలయంలో ఈ వివాహం నిర్వహించినట్లు సమాచారం.ఈ వ్యవహారంలో కొన్ని సంస్థల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దీనిని సాధారణ ప్రేమ వివాహంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా జరిగిన ఘటనగా పరిశీలిస్తున్నారు.
