ఆ రైతులకు రేపటి వరకూ గడువు

0

*ఆ రైతులకు రేపటి వరకూ గడువు* *రైతు బంధు అందనివారు దరఖాస్తు చేయండి*

హైదరాబాద్‌: రైతు బంధు పథకం కింద బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ కాని రైతులు ఈనెల 5(రేపటి)లోగా దరఖాస్తు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి సూచించారు. రైతులకు ఏ గ్రామంలో భూమి ఉంటే అక్కడి వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)కు వివరాలు అందజేయాలి.

ఇప్పటివరకూ 56,94,185 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7183.67 కోట్లను జమ చేసినట్లు ఆయన వివరించారు. బ్యాంకు ఖాతాల వివరాలు ఏఈఓలకు ఇవ్వని వారు వెంటనే అందజేయాలి. మొత్తం 34,860 మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన సొమ్ము వారి ఖాతాలు పనిచేయడం లేదని వెనక్కి వచ్చేశాయి. మరో 3400 మంది రైతుల పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డులో పేరు తేడా ఉన్నందున రైతు బంధు సొమ్ము ఆన్‌లైన్‌లో జమ కావడం లేదు.

వీరందరూ తక్షణం ఏఈఓలను కలిసి వాటిని సరిచేయించుకోవాలి. ఈ సొమ్ము వద్దనుకునేవారు ‘గివ్‌ ఇట్‌ అప్‌’ అనే దరఖాస్తును నింపి ఇవ్వాలి. అప్పుడు సొమ్ము జమ నిలిపివేస్తారు. ఏఈఓల మొబైల్‌ నంబర్లను agri.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

ఈ పథకం సొమ్ము అందడంలో రైతులెవరికైనా ఇబ్బందులుంటే సమీపంలోని మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ స్పందన లేకపోతే నేరుగా వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం సెల్‌ నంబరు 72888 76545కు ఫోన్‌ చేసి సమస్యలు చెప్పవచ్చు.

Leave a Reply