కర్నూలులో అత్యాధునిక క్షిపణి ప్రయోగం సక్సెస్

Teluguwonders:
రక్షణ రంగానికి చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డీఆర్డీఓ) తేలికపాటి యాంటీ ట్యాంక్ గైడెన్స్ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద పరీక్షించడం విశేషం. ఆర్మీ సహకారంతో ఈ క్షిపణి పరీక్షను డీఆర్డీఓ విజయవంతంగా పూర్తి చేసింది.
దేశంలో రెండో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తున్న డీఆర్డీఓ.. దీనికి అనువైన ప్రదేశంగా కృష్ణా జిల్లా నాగాయలంకలోని గుల్లలమోదను గుర్తించింది. ఇప్పటి వరకూ చాందీపూర్‌లో మాత్రమే క్షిపణులు పరీక్షిస్తున్నారు. 👉ఓ సైనికుడు మోసుకెళ్లే విధంగా డీఆర్‌డీవో ఈ క్షిపణిని రూపొందించింది. అనుకున్న సమయం ప్రకారం ఇది లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. తేలికపాటి యాంటీ ట్యాంక్ గైడెన్స్ క్షిపణుల్లో ఇది మూడో తరానికి చెందింది. ఈ క్షిపణి అధునాతన ఏవియానిక్స్‌తో పాటు అత్యాధునిక ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ సౌకర్యం కలిగి ఉంది.
🔍పరిశోధనలు :
రెండవ క్షిపణి పరీక్ష కేంద్ర ప్రాజెక్టకు కీలకమైన అనుమతుల గురించి గతేడాది కేంద్రప్రభుత్వ సైంటిఫిక్ అడ్వయిజర్ సతీష్‌రెడ్డి, ఢిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ విశేషంగా కృషి చేశారు. క్షిపణి ప్రయోగ కేంద్రానికి ఆరేళ్లుగా డీఆర్‌డీవో అధికారులు, అటవీశాఖ అత్యున్నత అధికారులు గుల్లలమోద, లైట్‌హౌస్ ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించి అవసరమైన వనరుల పరిస్థితిని అధ్యయనం చేశారు. సముద్రతీరంలో గాలివేగం, అత్యాధునిక భూ పరిశోధనలు ముగించారు.
🔴గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రానికి శంకుస్థాపన :
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో క్షిపణి పరీక్ష కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. దీని నిర్మాణానికి 154.42 హెక్టార్ల భూమికి సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవలే అనుమతులు ఇచ్చింది. దివిసీమ ప్రజల అభివృద్ధి కల సాకరం కానుండటంతో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.

Today, I went to the beachfront with my kids. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to her ear and screamed.
There was a hermit crab inside and it pinched her ear.
She never wants to go back! LoL I know this is entirely off topic but I had to tell someone!
Spot on with this write-up, I seriously think this site needs
much more attention. I’ll probably be returning to see more, thanks for the info!
Hi, I think your site might be having browser compatibility issues.
When I look at your blog site in Firefox, it looks fine
but when opening in Internet Explorer, it has some overlapping.
I just wanted to give you a quick heads up! Other then that, excellent blog!