Andhra Pradesh: చేతులు కట్టేసి, చిత్రహింసలు పెట్టి.. భార్యను చితకబాదిన భర్త!

husband-beat-wife

మద్యానికి బానిసైన బాలాజీ.. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని వేధింపులకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించాడు. విషయం తెలిసి స్థానికులు అడ్డుకుని ఆమెను కాపాడిన సంఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోనికి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

మద్యానికి బానిసైన బాలాజీ.. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని వేధింపులకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించాడు. విషయం తెలిసి స్థానికులు అడ్డుకుని ఆమెను కాపాడిన సంఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోనికి వచ్చింది.

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో సుమారు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తరచుగా తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలో భార్యా పిల్లలను వదిలేసి పరాయి మహిళతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కలుజువ్వలపాడు గ్రామానికి వచ్చిన బాలాజీ స్థానికంగా ఉండే బేకరీలో పనిచేస్తున్న భార్య పని చేసిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కట్టేసి తీవ్రంగా కొట్టాడు. స్థానికులు మహిళను కాపాడారు.

అటు కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో ఉంటూ ఓ బేకరీలో పనిచేస్తున్న భాగ్యలక్ష్మి పిల్లలను పోషించుకుంటుంది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లే బాలాజీ.. భార్య సంపాదించుకుని దాచి పెట్టుకున్న డబ్బులు కూడా తీసుకొని వెళ్లేవాడు. ఈక్రమంలోనే మరోసారి ఇంటికి వచ్చిన బాలాజీ.. భార్యను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో బాలాజీ, తన కుటుంబ సభ్యులు, మరో మహిళతో కలిసి భాగ్యలక్ష్మిని కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. తాళ్లతో ఆమెను బంధించి బెల్టు, కర్రలతో చితకబాదాడు. అంతేకాదు, ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంటనే స్పందించిన దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ విచారణకు ఆదేశించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బ్రహ్మనాయుడు బాధిత మహిళ నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భాగ్యలక్ష్మిపై దాడి చేసిన భర్త బాలాజీతో పాటు అతనికి సహకరించిన మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights