హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్ధమైన 20కి పైగా ఫర్నిచర్ షాపులు

హైదరాబాద్‌లోని బాచుపల్లి – ప్రగతి నగర్ ప్రాంతంలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ షాపుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది.
మంటలు వేగంగా వ్యాపించి సుమారు 20కి పైగా ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని 6 ఫైర్ ఇంజిన్ల సహాయంతో గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
