Anupama Parameswaran: మేసేజ్ చేసిన రెండు రోజులకే చనిపోయాడు.. జీవితంలో మర్చిపోలేని బాధ.. అనుపమ..

అనుపమ పరమేశ్వరన్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే కిష్కంధపురి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇటీవలే మలయాళంతోపాటు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. కొన్ని రోజుల క్రితం కిష్కింధపురి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ హారర్ కామెడీ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్లలో అనుపమ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
అనుపమ మాట్లాడుతూ.. “మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే కుటుంబం, ప్రేమ, స్నేహం పట్టువిడుపులతో ఉండాలి. కోపాన్ని మనసులో పెట్టుకుంటే చివరకు అంతులేని విషాదమే మిగులుతుంది. నా క్లోజ్ ఫ్రెండ్… ఇద్దరు చాలా మంచి స్నేహితులం. కానీ కొన్ని కారణాలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అతడితో మాట్లాడం మానేశాడు. కానీ తను నాతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. చాలాసార్లు నాకు మెసేజ్ చేశాడు. అనవసరమైన గొడవలు ఎందుకు అని నేను మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మానేశాను. అలాగే ఒకరోజు మళ్లీ మెసేజ్ చేశాడు. కానీ నేను పట్టించుకోలేదు. కానీ రెండు రోజులకే అతడు చనిపోయాడనే విషయం తెలిసింది. ఒక్కసారిగా షాకయ్యాను. నా జీవితంలో అది మర్చిపోలేని విషాదం. మనల్ని ప్రేమించే వాళ్లతో మనస్పర్థలు జీవితాంతం విషాదాన్ని మిగులుస్తాయి” అంటు చెప్పుకొచ్చింది.
అనుపమకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ కేరళ కుట్టి.. వారాల గ్యాప్ లో రెండు తెలుగు సినిమాలతో అనుపమ.. ప్రేక్షకులను పలకరించింది. ఆగస్టులో పరదా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు కిష్కంధపురి అనే హారర్ సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
