నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. వైఎస్ జగన్ హాజరు అయ్యేనా..?

ఇవాళ్టి (సెప్టెంబర్ 18) నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. 16వ శాసనసభ నాలుగో సమావేశం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాలులో మొదలవుతాయి. ఈ సమావేశాలు 7 రోజుల పాటు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో కొన్ని ముఖ్య బిల్లులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇవాళ్టి (సెప్టెంబర్ 18) నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. 16వ శాసనసభ నాలుగో సమావేశం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాలులో మొదలవుతాయి. ఈ సమావేశాలు 7 రోజుల పాటు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో కొన్ని ముఖ్య బిల్లులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ ప్రారంభం కానుంది. ఉదయం10 గంటలకు శాసనమండలి మొదలు కానుంది. అయితే, దసరా పండుగ నేపథ్యంలో 5 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రశ్నోత్తరాల తర్వాత BAC సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దసరా తర్వాత కూడా కొన్ని రోజులు నిర్వహించాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు భావిస్తున్నారు.
అసెంబ్లీలో ఇటీవల తీసుకొచ్చిన ఆరు ఆర్టినెన్స్‌లను బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. వీటితో కలిపి 20 బిల్లులను ఈ సమావేశాల్లో తెచ్చేందుకు కూటమి సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. 15 నెలల కూటమి విజయాలను అసెంబ్లీ వేదికగా మరోసారి వివరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయ్యింది. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ విజయవంతం, DSC ద్వారా ఉద్యోగ నియామకాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో పాటు అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వ పలు సబ్జెక్టులను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో లిక్కర్ కేసు తోపాటు గత ప్రభుత్వ పాలన పై మరోసారి అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
