జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు

ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మరో కీలక నిర్ణయం. ఇకపై ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు. ఇకపై రాత పరీక్షలో మెరిట్ ద్వారానే ఉద్యోగాల భర్తీ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన జగన్..ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు. ఉద్యోగాల భర్తీలో కేవలం రాత పరీక్షలలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
అంతేకాదు రాబోయే రోజుల్లో ఏపీపీఎస్సీఉద్యోగాలను అంత్యంత పారదర్శక విధానం ద్వారా భర్తీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ సిద్ధం చేయాలని.. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలన్నారు.
ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారి తీస్తుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదని.. అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు జగన్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జనవరిలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల్ని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు.
Aslo Read :
కేసీఆర్‌ను మళ్లీ ఇరుకునపెట్టిన జగన్? భిన్న పంథాలో ఇద్దరు సీఎంలు..!
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 13వ రోజుకు చేరింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు తెగేసి చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని.. చర్చలు జరిపేది లేదని మరో వైపు కేసీఆర్ తన వైఖరిని కుండబద్ధలు కొట్టారు. ఆర్టీసీ మనుగడ సాగించాలంటే.. పోటీతత్వం ఉండాలని కేసీఆర్ చెబుతున్నారు. అందుకే 50 శాతం ఆర్టీసీ బస్సులు 30 శాతం అద్దె బస్సులు.. 20 శాతం బస్సులు ప్రయివేట్ వ్యక్తులు నడిపేలా ఉండాలని సీఎం తెలిపారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
