Google chrome వాడుతున్నారా?.. ఐతే ఇది చదవండి

Teluguwonders:
గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? వెంటనే కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి లేకపోతే.. మీ కంప్యూటర్, ఫోన్లను హ్యాకర్లు హైజాక్ చేసేస్తారు. మీ బ్యాంక్ వివరాలు లేదా రహస్య సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదం కూడా ఉందట.
💥Metro’ వెబ్‌సైట్ వెల్లడించిన కధనం ప్రకారం :
మీ ఫోన్ లేదా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ (Google chrome) బ్రౌజర్ వాడుతున్నారా? అయితే, వెంటనే దాన్ని అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ డేటా లేదా మీ రహస్య సమాచారం ఇతరుల చేతులకు చిక్కే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గూగుల్ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు అర్జెంట్ అప్‌డేట్‌ను ఇష్యూ చేసినట్లు ‘Metro’ వెబ్‌సైట్ వెల్లడించింది.
👉ఇంతకీ సమస్య ఏంటంటే :
బ్రౌజర్‌లోని కంటెక్ట్స్‌లో గల ఆర్బిట్రరీ కోడ్‌ను హ్యాకర్స్ చేజిక్కించుకున్నారని, క్రోమ్ వినియోగదారుల సీక్రెట్ డేటాను చూడటమే కాకుండా, దాన్ని ఎడిట్ లేదా డిలీట్ చేయగలరని పేర్కొంది.
💥ముఖ్యంగా :
బ్రౌజర్‌లో నిక్షిప్తమయ్యే బ్యాంక్ వివరాలు లేదా రహస్య సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకుని బెదిరింపులకు పాల్పడే అవకాశాలున్నాయి.
సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఈ సమస్యను గుర్తించింది. హ్యాకర్లు ప్రస్తుత వినియోగదారుల సమాచారాన్ని సేకరించి.. అవే వివరాలతో కొత్త అకౌంట్‌ను సృష్టించుకోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో గూగుల్ ఈ సమస్యను పరిషర్కించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే Macలో ఈ సమస్యను పరిష్కరించింది. రానున్న వారాల్లో లినక్స్, విండోస్‌లలో కూడా ఈ సమస్యను పరిష్కరించనుంది.
ఇలా చేస్తే సేఫ్ :
హ్యాకర్లకు మీ సమాచారం చిక్కకూడదంటే క్రోమ్ వినియోగదారులు గుర్తింపు పొందని వెబ్‌సైట్ లింకులు, హైపర్ లింకులు క్లిక్ చేయకపోవడమే ఉత్తమం. So.. be care full.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
