అనంతపురానికి వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్..

Teluguwonders:
ఆసీస్ క్రేజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అనంతపురంలో మెరిశాడు. పట్టణంలోని ఆర్డీటీ స్టేడియాన్ని సందర్శించాడు. అనంతరం కర్నూలు జిల్లా పగిడిరాయికి బయలుదేరి వెళ్లాడు.
భారత్‌లో క్రికెట్‌ను ఆరాధిస్తారని ఆసీస్ వెటరన్ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామ సందర్శనకు వెళ్తూ అనంతపురంలో పర్యటించాడు.
🔴 𒐵విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు:
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు క్రికెటర్ గిల్‌క్రిస్ట్ ఇక్కడకు వచ్చారు. ఆయన వెంట ఆర్డీటీ ప్రతినిధులు మాంచో ఫెర్రర్ తదితరులు ఉన్నారు .
🔴స్టేడియం అద్భుతంగా ఉందని ప్రశంస :
అక్కడున్న ఆర్డీటీ క్రికెట్ స్టేడియాన్ని ఆడమ్ సందర్శించాడు. స్టేడియంలో క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారన్నాడు. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని ప్రశంసించాడు.
భారత క్రికెట్ జట్టు ప్రదర్శనపైనా ఆడమ్ మాట్లాడారు. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ప్రదర్శన చాలా బాగుందని కితాబిచ్చాడు. మిగిలిన జట్లతో పోలిస్తే టీమిండియా ప్రమాదకర జట్టుగా అభివర్ణించాడు. కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయని, తమ జట్టు ఫీల్డింగ్‌లో పేలవంగా ఉందని ఆసీస్ జట్టును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.

Howdy, i read your blog occasionally and i own a similar one and i was just wondering if
you get a lot of spam feedback? If so how do you protect against it, any plugin or anything you can suggest?
I get so much lately it’s driving me insane so any help is very much appreciated.