March 26, 2026

బాలయ్యకు అంతర్జాతీయ అవార్డు🔥అభిమానుల్లో ఆనందం….

balayya_logo (1)

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు మరో గొప్ప గౌరవం లభించింది. సినీ రంగంలో దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆయన సేవలను గుర్తిస్తూ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD 2026)’లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. దిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.

భారతీయ సినిమా అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన నటీనటులను సత్కరించే భాగంగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మార్చి 31 వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో పలు భాషల సినిమాలను ప్రదర్శించనున్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణతో పాటు సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ మరియు లెజెండరీ నటుడు ధర్మేంద్రలకు కూడా జీవితకాల సాఫల్య పురస్కారాలు అందజేశారు. బాలకృష్ణకు ఈ అవార్డు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading