Bhishma Niti: భీష్ముడు చెప్పిన ఈ భీష్మ పితామహుడి ఈ 10 విధానాలను పాటించే వారు జీవితంలో విజయం సాధిస్తారు

అన్యాయం అని తెలిసి ఖడించకుండా చూస్తూ ఉంటే అది కూడా పాపమే అని చెబుతోంది ద్రౌపది వస్త్రాహరణం. ఒక అబలపై అత్యాచారం తమ కనుల ముందే జరుగుతున్నా.. మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు చూస్తూ ఉండి పోయారు. అందుకు ఫలితంగా కురుక్షేత్ర యుద్ధంలో అనుభవించారు. అలా అంపశయ్య మీద ఉన్న భీష్ముడు జీవితంలో విజయం సాధించాలంటే చేయాల్సిన పనుల గురించి చెప్పాడు. అవి ఏమిటో తెల్సుకుందాం..
హిందూ ధర్మంలో కర్మ సిద్దంతాన్ని నమ్ముతారు. ఈ భూమి మీద జన్మించిన ఏ జీవి తాము చేసిన కర్మలకు అతీతం కాదు అని.. మనం చేసిన కర్మలకు ఫలితాలను మనమే అనుభవించాలని రామాయణం, మహాభారతంలోని అనేక సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అన్యాయం చేస్తున్నప్పుడు అక్కడ జరుగుతుంది అన్యాయం అని తెలిసి ఖడించకుండా చూస్తూ ఉంటే అది కూడా పాపమే అని చెబుతోంది ద్రౌపది వస్త్రాహరణం. ఒక అబలపై అత్యాచారం తమ కనుల ముందే జరుగుతున్నా.. మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు చూస్తూ ఉండి పోయారు. అందుకు ఫలితంగా కురుక్షేత్ర యుద్ధంలో అనుభవించారు. అలా అంపశయ్య మీద ఉన్న భీష్ముడు జీవితంలో విజయం సాధించాలంటే చేయాల్సిన పనుల గురించి చెప్పాడు. అవి ఏమిటో తెల్సుకుందాం..
కురుకుల వృద్ధుడైన భీష్ముడు.. పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధ నివారించేందుకు యుద్ధానికి ముందు అనే విషయాలను చెప్పాడు. అయితే మంచి విషయాలను పట్టించుకోకుండా శకుని మాటలు విని యుద్ధానికి సై అన్నాడు దుర్యోధనుడు. కురుక్షేత్రంలో నేలకొరిగిన భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి.. రాజుగా, మనిషిగా చేయాల్సిన పనుల గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కృష్ణుడు, అర్జునుడు, యుధిష్ఠిరులకు ఆయన చెప్పిన విషయాలను భీష్మ నీతిగా పరిగనిస్తారు. ఆయన బోధనలలో రాజకీయాలు, నీతి, జీవితం, ఆధ్యాత్మికత సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. విజయం కోసం భీష్ముడు చెప్పిన విషయాలు ఏమిటంటే
- ఇతరులు ఇష్టపడే మాటలు మాట్లాడండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, విమర్శించడం, చెడు కోరుకోవడం ఇవన్నీ విడిచి పెట్టండి. ఇతరులను అవమానించడం, అహంకారం, గర్వం అనేవి దుర్గుణాలు.
- త్యాగం లేకుండా ఏదీ సాధించబడదు. త్యాగం లేకుండా అంతిమ ఆదర్శాన్ని సాధించలేము. త్యాగం లేకుండా మనిషి భయం నుంచి విముక్తి పొందలేడు. త్యాగం చేసిన మనిషి అన్ని రకాల ఆనందాలను పొందుతాడు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
