సెకండ్ వీక్ కెప్టెన్‌గా డిమాన్ పవన్.. గట్టిగానే సపోర్ట్ చేసిన రీతూ చౌదరి..

bigg-boss-9-16

బిగ్ బాస్ హౌస్ లో మాటలతో పాటు ఆటలూ ముఖ్యమే. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను కంప్లీట్ చేసినప్పుడే కంటెస్టెంట్స్ కు మంచి మార్కులు పడతాయి. అయితే ఒక్కోసారి ఈ టాస్కులు మరి వయలెంట్ గా ఉంటాయి. కంటెస్టెంట్స్ కూడా మొరటుగా ప్రవర్తిస్తుంటారు. తోటి వారికి ఏమైనా పర్లేదు మనం గెలిస్తే చాలు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు.

హౌస్‌లో చిన్న చిన్న ఫైట్స్, ఎమోషనల్ మూమెంట్స్ కొనసాగాయి. బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ వీక్ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓనర్లు-టెనెంట్ల మధ్య టాస్క్ లు పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ కు రీతూ చౌదరిని సంచలక్ గా పెట్టాడు బిగ్ బాస్. బిగ్ బాస్ కొత్త కెప్టెన్ కోసం “టైమర్ టాస్క్” ఇచ్చాడు. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ రౌండ్‌లో టైమర్ ఆధారంగా పోటీ జరిగింది. ఈ టాస్క్ స్ట్రాటజీలు, వాదనలకు దారితీసింది.. ఈ టాస్క్‌లో ‘రంగుపడుది’ థీమ్‌తో ఓనర్స్ (సెలబ్రిటీలు), కామనర్స్ (టెనెంట్స్) మధ్య పోటీ జరిగింది. అయితే నిన్న బిగ్ బాస్ ఓనర్లుగా ఉన్న ఏడుగురిలో ఏ నలుగురైతే కెప్టెన్సీకి అనర్హులని భావిస్తారో వారిపేర్లను తీసేయాలని చెప్పాడు. దాంతో అందరూ మాట్లాడుకొని ఓటింగ్ ప్రకారం వెళదామని డిసైడ్ అయ్యారు.

డీమాన్ పవన్‌ కెప్టెన్‌గా వద్దని ఎక్కువ మంది ఓట్లు వేశారు. కానీ అప్పుడే రీతూ ఎంట్రీ ఇచ్చింది. మర్యాద మనీష్ కంటే ప్రియ, దమ్ము శ్రీజ కంటే కెప్టెన్‌గా డీమాన్ పవన్ బెటర్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. దాంతో అతని పేరు లిస్ట్ లోకి వచ్చింది. ప్రియ, దమ్ము శ్రీజ, హరీష్, పవన్ కళ్యాణ్.. నలుగుర్నీ కెప్టెన్సీ రేసులో లేరు అని సంజన అనౌన్స్ చేసింది. దాంతో మమ్మల్ని ఎందుకు తీసేశారు అని ప్రియ, శ్రీజ గట్టిగానే వాదించారు. వారికి సమాధానం ఇస్తూ రీతూ చౌదరి కూడా గట్టిగానే వాదించింది. కెప్టెన్సీ కంటెండర్లుగా ఉన్న భరణి, మర్యాద మనీష్, డీమాన్ పవన్‌ కు ఓ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్.

మీతో పోటీపడటానికి  ఒకరికి కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ పడే ఛాన్స్ ఇవ్వొచ్చుఅని చెప్పాడు. వారు వెంటనే ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పారు. దాంతో భరణి, మర్యాద మనీష్, డీమాన్ పవన్‌, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. వీరి మధ్య రంగు పడుద్ది’ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. దీనిలో టీషర్ట్ మీద రంగు పడకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ లో ఎవరి టీ షర్ట్ మీద ఎక్కువ రంగు ఉంటుందో వాళ్లు గేమ్ నుంచి అవుట్ అవుతారు. మొదటి రౌండ్ లో భరణిని అవుట్ చేద్దామని మనీష్ ట్రై చేశాడు. కానీ ఇమ్మాన్యుయేల్ , భరణి కలిసి మనీష్ కు ఎక్కువ రంగు పూశారు. డిమాన్ మాత్రం వీరికి దూరంగా ఉండిపోయాడు. దాంతో మొదటి రౌండ్ లో మనీష్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్ లో భరణి-ఇమ్మూ కలిసి డీమాన్‌ని టార్గెట్ చేశారు.. ఇక్కడే రీతూ సంచలక్ గా చేయకూడని తప్పులన్నీ చేసింది. బజర్ మోగే ముందు వరకూ డీమాన్ టీ షర్ట్ మీదే ఎక్కువ రంగు ఉంది కానీ నేను నో చెప్పకా కూడా భరణి రంగు పూశారు అంటూ ఆయనను తప్పించింది. దాంతో ఓనర్లు తెగ మెచ్చుకున్నారు. కానీ భరణి ఆమెతో వాదించకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాడు. చివరిగా ఇమ్మానుయేల్-డీమాన్ మధ్య టాస్క్ జరిగింది. టీ షర్ట్ లాగకూడదు, రంగు మీదకి విసరకూడదు దగ్గరకు వెళ్లి రంగు పూయాలి అని రూల్స్ లో ఉంది. కానీ డిమాన్ ఇమ్మూ టీషర్ట్ లాగి రంగు పూశాడు. ఇది తప్పు అంటూ రీతూని అడిగినా కూడా ఆమె రివర్స్ లో ఇమ్మూ పైనే సీరియస్ అయ్యింది. అయినా కూడా ఇమ్మూ పవన్ కు గట్టిపోటీ ఇచ్చాడు. ఓపిక అయిపోయినా, దమ్ము వస్తున్నా చాలాసేపు పోరాడాడు. చివరిగా కొద్దీ తేడాలో పవన్ విన్ అయ్యాడు. డీమాన్‌ని కెప్టెన్ చేయాలనే రీతూ చౌదరి గట్టిగానే ప్రయతించింది. ఫైనల్ గా డిమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights