కోడలిని అత్యాచారం చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే :వెలుగు లోకి వచ్చిన దారుణమైన ఘటన

BJP MLA manoj

Teluguwonders:

కోడలిపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై కేసు నమోదైంది. భర్త ఇంట్లో లేని సమయంలో తుపాకీతో బెదిరించి తనపై అఘాయిత్యం చేశాడని బాధితురాలు ఆరోపించారు.

కోడలిపై అత్యాాచారం:

బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై ఆమె కోడలు సంచలన ఆరోపణలు చేశారు. తుపాకీతో బెదిరించి తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపారు. భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే మద్యం మత్తులో మామ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గతేడాది డిసెంబరు 31 అర్ధరాత్రి తర్వాత అతడు తనపై బలత్కారం చేశాడని ఆమె పోలీసులకు తెలిపారు.
కోడలి ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే మనోజ్‌ షోకీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మనోజ్‌ షోకీన్‌ ఢిల్లీ బీజేపీకి చెందిన కీలక నేత. నంగ్లోయ్‌, ముంద్కా నియోజకవర్గాల నుంచి ఆయన ఒక్కో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

🔴వివరాల ప్రకారం..:

ఘటన జరిగిన రోజు రాత్రి ఆమె తన పుట్టింటి నుంచి భర్త, సోదరుడు, మరో కజిన్ బ్రదర్‌తో కలిసి మెట్టినింటికి బయలుదేరారు. అయితే ఆమెను తన భర్త నేరుగా ఇంటికి తీసుకెళ్లకుండా.. ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడికి అప్పటికే చేరుకున్న కొంత మంది బంధువులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఇంటికి చేరుకున్నారు.

🔴తుపాకీ తీసి.. బెదిరించి :

డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.30 గంటలకు బాధితురాలిని ఆమె భర్త ఇంట్లో దిగబెట్టి స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిపోయినట్లు ఆమె చెప్పారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆమె మామ మనోజ్ షోకీన్.. మాట్లాడాల్సి ఉందంటూ తన గది తలుపు తట్టాడని.. డోర్ తీయగానే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు.
మద్యం సేవించి ఉన్న తన మామను అతడి గదికి వెళ్లిపోయి పడుకోవాల్సిందిగా సూచించానని.. అతడి చర్యను నిరాకరించానని బాధితురాలు తెలిపారు. దీంతో మనోజ్ షోకీన్ తన వెంట తెచ్చుకున్న తుపాకీ తీసి.. తన సోదరుణ్ని చంపుతానని బెదిరించి తనను రేప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అత్తామామలు తనను తీవ్రంగా వేధించేవారని ఫిర్యాదు చేశారు. అత్యాచారం, గృహ హింస నేరారోపణలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

👉పరువు పోతుందని..:

తన కుటుంబం పరువు పోతుందని.. సోదరుడికి వివాహం కావాల్సి ఉందనే ఉద్దేశంతో తనపై జరిగిన దారుణం గురించి ఇన్నాళ్లుగా ఎవరికీ చెప్పలేదని బాధితురాలు వెల్లడించారు.

💥విపక్షాలు మండిపడుతున్నాయి:

ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఆగ్రహజ్వాలలు కొనసాగుతుండగానే మరో రేప్ ఘటన వెలుగులోకి రావడంతో బీజేపీపై విపక్షాలు మండిపడుతున్నాయి.
[09:45, 8/12/2019] Mahendra sreenath: 10.కోడలిని అత్యాచారం.. చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ; వెలుగు లోకి వచ్చిన దారుణమైన ఘటన


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights