నన్ను ఇలా చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. ఆ నటుడి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం.

ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు బ్రహ్మానందం. వందల సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించారు. బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు తెలియకుండానే నవ్వు వస్తుంది. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు బ్రహ్మానందం.
ఒక్కడు సినిమాలో చేసిన పాస్‌పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2013 డిసెంబరు 7 న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు మధ్య మంచి అనుబంధం ఉండేది. ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. ధర్మవరపు చనిపోయిన తర్వాత బ్రహ్మానందం చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన గురించి మాట్లాడుతూ.. ధర్మవరం ను నేను ధర్మన్న అని పిలిచేవాడిని.. చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి మాట్లాడాడు.. ఫోన్ చేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్ రా.. నువ్వు నన్ను చూడటానికి రావొద్దురా.. నువ్వు నన్ను చూడలేవు. ఇంతకుముందు నువ్వు చూసినట్టు నేను ఇప్పుడు లేను.. నా పరిస్థితి బాలేదు. నీ గుర్తుల్లో నేను ఎలా ఉన్నానో అలానే ఉండాలి రావొద్దు రా అన్నాడు. నేను రోజూ ప్రయత్నించేవాడిని వెళ్లి చూడాలని కానీ వొద్దు అని నన్ను ఆపే వాడు. కాదు కాదు నేను వస్తాను అని పట్టు పడితే.. డిసెంబర్ నెలలో వద్దువుగాని రా.. అప్పటికి నేను కోలుకుంటాను.. బాగుంటాను.. ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉంటాను అన్నాడు. అలాగే నీకోసం ఓ పద్యం పడతాను అని ఓ పద్యం పాడాడు.. నేను త్వరగానే వచ్చేస్తా.. మనం అందరం మళ్లీ కలిసి నటిద్దాం అని చెప్పారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మానందం.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.

Thanks for providing such valuable and well-researched content. I’m grateful for your hard work.
Lüks su arıtma cihazı kategorisinde rekabetin yoğun olduğu bir ortamda, Arıtmapark kalite ve güvenilirlikten ödün vermeden yoluna devam ediyor. Özellikle son yıllarda suyun içerisindeki ağır metaller ve bakteriler konusunda daha bilinçli hale gelen tüketiciler, Arıtmapark ürünlerini tercih ederek sağlıklı su tüketiminin keyfini çıkarıyor.