రాజధాని పేరిట చంద్రబాబు సాగించిన అరాచకాలు బయటికి వస్తున్నాయి !

Chandrababu's anarchy in the name of the capital is coming out!

Teluguwonders:

గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి అని నిత్యం డప్పు పట్టుకుని చెప్పేవాడు. కానీ రాజధానిలో ఇప్పుడు ఏమి లేదన్న సంగతీ అందరికి తెలిసి పోయింది. అయితే వైసీపీ మొదటి నుంచి రాజధానిలో అవినీతి జరిగిందని చెబుతుంది. ఇప్పుడు ఆ విషయంలో కొన్ని నిజాలు బయటికి వస్తున్నాయి. రాజధాని కోసం సేకరించిన నిధులను .. బయట అప్పులను బాబు గారు చివర్లో ఎన్నికల పధకాల కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఓట్లను కొనుగోలు చేసేందుకు వాడినట్టు తెలుస్తుంది. ఇన్నీ అరాచకాలు చేసిన బాబు పైకి మాత్రం చిత్త శుద్దితో రాజధానిని నిర్మిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి .. అమరావతి అంటూ ఎప్పుడు చూసిన బాబు గారు భజన చేసేవారు.

ఈ భజన భరించలేక ప్రజలు బాబుగారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అమరావతి విషయంలో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇప్పుడేమో చంద్రబాబు నేను ఆదాయాన్ని సృష్టించే రాజధానిని నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని తెగ భాద పడిపోయారు. నిజానికి అమరావతి వల్ల ఆదాయం చేకూరింది టీడీపీ నేతలకు మాత్రమే. అయితే బాబు ఐదేళ్లలో నోరు తెరిస్తే చాలు అమరావతి .. అమరావతి ఎంత హడావుడి .. కానీ చివరికి రాజధానిలో కనీసం శాశ్వత ప్రభుత్వ భవనాలు కూడా లేని పరిస్థితి. చివరికి రాజధాని ప్రాంతంలో కూడా బాబు గారి పార్టీ గెలవకుండా పోయిన పరిస్థితి.

లేనిదే ఉంది అని చెప్పడం. అబద్దాన్ని నిజం చేయడం గ్లోబల్ ప్రచారం అంటారు. ఇవన్నీ వెరసి టీడీపీ హయాంలో ప్రజలకు చంద్రబాబు మీద ఆ పార్టీ మీద చిరాకు, కసి అన్నిటినీ తెప్పించింది. అందుకే జనాలు చారిత్రత్మక తీర్పును ఇచ్చారు. టీడీపీ మారకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందని నిరూపించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ముఖ్యంగా అమరావతి విషయంలో ప్రజలను ఘోరంగా మోసం చేయడానికి ప్రయత్నించారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights