ఆ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో వెలుగుచూస్తున్న అక్రమ సంబంధాలు

kcr farm house

Teluguwonders: ఒక పక్క రాష్ట్ర పాలన మరోపక్క పార్టీ నిర్వహణ ఈ పనులతోనే సతమతమై పోతుంటే ఆ ముఖ్యమంత్రి కి ఇప్పుడు కొత్తగా మరొక తలనొప్పి వచ్చి పడింది .ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా !ఎవరో కాదండి !! ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎం కేసీఆర్‌. విషయం లోకి వెళ్తే సాధారణంగా ఏదైనా సమస్య పరంగా ఇబ్బందులు ఏర్పడినప్పుడు మానసిక ప్రశాంతత కోసం పెద్దవాళ్ళు తన ఫార్మ్ హౌస్ కి వెళ్తూ ఉంటారు .

కెసిఆర్ కూడా అందుకు మినహాయింపు కాదు హైదరాబాద్లోనే కేసీఆర్‌కు సొంత ఫామ్‌హౌస్ ఉంది. ఎర్రవల్లిలో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమిలో ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా, మరోవైపు పార్టీ అధినేతగా ఉంటూ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నా ఈ ఒత్తిడి నుంచి సేదతీరేందుకు ఆయన తన ఫామ్‌హౌస్‌కు వెళుతుంటారు. అయితే, ఫామ్‌హౌస్‌లో ఆయనకు సరికొత్త తలనొప్పి వచ్చింది. ఇక్కడ పని చేసే కూలీలు మధ్య వివాహేతర సంబంధాలు పెట్టుకుని నిత్యం గొడవపడుతున్నారట. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు తెలియడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారట.

🔴వివరాలలోకి వెళ్తే :
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి చూస్తే , సిద్ధిపేట జిల్లాకు చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి భార్యతో కలిసి ఈ ఫామ్‌హౌస్‌లో పనికి చేరారు. ఎల్లయ్య భార్యకు అప్పటికే ఫాంహౌస్‌లో విధులు నిర్వర్తిస్తున్న అంజనేయులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

🔴అనుకున్నంతా జరిగింది :
అయితే అప్పట్లోనే ఎల్లయ్య భార్య హఠాత్తుగా కనపడకుండా పోయింది. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం తన భార్యకు ఆంజనేయులు మాయమాటలు చెప్పి లేపుకెళ్లాడని ఎల్లయ్య ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది. ఎల్లయ్య తన భార్య కనిపించకపోవడంతో బంధువుల ఇళ్లలో కూడా వెతికాడు. చివరికి పోలీసులను ఆశ్రయించగా, నీ భార్య వస్తుందిలే పో అంటూ పంపించివేశారు.

🔴న్యాయం చేయాలంటూ ఓ వీడియో :
పోలీస్ లతో,కోర్ట్ ల తో ఎంతకీ లాభం లేకపోవడం తో, తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో రూపొందించి పెట్టాడు ఎల్లయ్య .సోషల్ మీడియాలో పెట్టడంతో దానికి విపరీతమైన స్పందన వచ్చింది. 👉ఈ నేపథ్యంలో, పోలీసులు తనను ఇంటికి వచ్చి మరీ కొట్టారంటూ ఎల్లయ్య ఆరోపిస్తున్నాడు. దీనిపై పోలీసులు భిన్నవాదన వినిపిస్తున్నారు. ఎల్లయ్య వేధింపులు భరించలేక అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని గజ్వేల్ సీఐ అంటున్నారు. అసలు కథ పైనున్న పెరుమాళ్ళకెరుక…


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights