రోజాపై శ్రీరెడ్డి దారుణమైన పోస్ట్ .. అతనితో లింక్ ఉందంటూ….

download

అనేకమంది సెలెబ్రిటీలపై వరుసగా ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి ఈ సారి సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేసింది.రోజాపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రోజాపై సంచలన ఆరోపణలు చేస్తూ వరుస పోస్ట్‌లను ఫేస్ బుక్‌లో షేర్ చేసింది నటి శ్రీరెడ్డి.

శ్రీరెడ్డి..ఈమె నోరువిప్పితే బూతుల పురాణం.. సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది అంటే మాత్రం అదొక సంచలనం. ఈమె ఒక పోస్ట్ పెడుతుంది అంటేనే సెలెబ్రిటీల కంగారు పడేలా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆ వార్తలో ఎంతనిజం ఉన్నది అనే విషయం పక్కనబెడితే నిజం అని నమ్మించేసేలా, అదేదో పక్కనుండి చూసినట్టు మరీ వర్ణిస్తుంటుంది.
ఈమెకు ఇదేం ఆనందమో తెలియదు కాని.. ఆధారాలు లేని ఆరోపణలతో సమాజంలో గౌరవంగా బతుకుతున్న వారిని రోడ్డు మీదకు లాగే పని పెట్టుకుంది. ఆమెకి సినిమాల్లో అవకాశాలు లేకపోయినా ఏ విధంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది.చీకటి బాగోతాలు అంటూ రకరకాల పోస్టులు పెడుతుంది గాని ఆ పని చెయ్యడం మాత్రం మానట్లేదు, ఇంతలో మానేలాకూడాలేదుఈవివాదాస్పదననటి.సమయం, సందర్భం లేకుండా తనకు సంబంధంలేని విషయాల్లో వేలుపెట్టి మరీ వారి బతుకులను బజారుకీడ్చే ప్రయత్నం చేస్తుంది. అర్ధనగ్న ప్రదర్శనతో ఇండస్ట్రీ పరువును జాతీయ స్థాయిలో బజారుకు లాగిన శ్రీరెడ్డి.. తన అర్ధరహిత ఆరోపణలతో మరోసారి చెలరేగింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ హీరోయిన్ రోజాపైదారుణమైనకామెంట్స్చేసింది.బుధవారం నాడు తన ఫేస్ బుక్‌లో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఒక నటితో ఎఫైర్ ఉందంటూ ఆ నటిపై దారుణమైన ఆరోపణలు చేసింది. సదరు నటి భర్తను సైతం వదలకుండా ఫొటోలతో సహా తన సోషల్ మీడియాలో షేర్ చేసి వివాదాన్ని రాజేసింది. ఇప్పుడు అదే నటి భర్తతో రోజాకి ఏవో పాత వ్యవహారాలు ఉన్నాయంటూ సుదీర్ఘమైన మైన పోస్ట్‌ను పెట్టింది శ్రీరెడ్డి. ఇందులో రోజా క్యారెక్టర్ గురించి నీచమైన కామెంట్స్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది.‘రోజా గారు మీరు వైసీపీలో ఉన్నందుకు నా పూర్తి మద్దతు, మిమ్మల్ని కించపరచాలని కాదు. మీకు నిజం చెప్పాలనేదే నా ప్రయత్నం’, ‘మీ రచ్చబండ లేదా బతుకు జడ్కా బండికి వాళ్లను పిలవండి. నేనూ కూడా వస్తా’ అంటూ వరుస పోస్ట్‌లుపెట్టిందిశ్రీరెడ్డి. అయితే రోజాపై ఇలాంటి ఆరోపణలు చేయడం శ్రీరెడ్డి కొత్తేం కాదు. క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ అప్పుడు కూడా రోజాని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights