Drinks For Glowing Skin: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ గ్లాసుడు తాగారంటే.. బ్యూటీ పార్లర్‌తో పనేలేదిక..!

best-drinks-for-glowing-skin

అమ్మాయిలు తమ ముఖం చందమామలా మెరిసిపోవాలని తెగ ఆరాటపడి పోతుంటారు. ఈ ముఖం మెరుపును పెంచడానికి ఖరీదైన ఉత్పత్తులు, బ్యూటీ ట్రీట్‌మెంట్‌లు ఆశ్రయిస్తుంటారు. కానీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లోపలి నుంచి కూడా పోషించాలి. ముఖ్యంగా కొన్ని పానియాలు ప్రతి ఉదయం తీసుకోవడం..

అకాలంగా వృద్ధాప్యంలోకి అడుగు పెట్టకూడదంటే చర్మ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టడం అవసరం. ముఖ్యంగా అమ్మాయిలు తమ ముఖం చందమామలా మెరిసిపోవాలని తెగ ఆరాటపడి పోతుంటారు. ఈ ముఖం మెరుపును పెంచడానికి ఖరీదైన ఉత్పత్తులు, బ్యూటీ ట్రీట్‌మెంట్‌లు ఆశ్రయిస్తుంటారు. కానీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లోపలి నుంచి కూడా పోషించాలి. ముఖ్యంగా కొన్ని పానియాలు ప్రతి ఉదయం తీసుకోవడం ద్వారా ఎటువంటి ఖరీదైన ఖర్చులు లేకుండానే మీ చర్మ కాంతిని సులభంగా పెంచుకోవచ్చు. ఏయే డ్రింక్స్‌ తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

నిమ్మ నీరు

నిమ్మకాయలో కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన విటమిన్ సికి మంచి మూలం. నిమ్మరసంలో సహజమైన ఆస్ట్రిజెంట్, మెరుపును ఇచ్చే లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ కాంతిని పెంచడంలో, మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొద్దిగా నిమ్మరసంతో గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఇది చర్మ కాంతిని పెంచడమే కాకుండా శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ బరువు తగ్గడంలో మాత్రమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా కాటెచిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి UV కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి ప్రతి ఉదయం గ్రీన్ టీ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు శరీరాన్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హైడ్రేషన్‌ను అందిస్తాయి. అందువలన శరీరం హైడ్రేట్ అయినప్పుడు చర్మం కూడా మెరుస్తుంది. అదనంగా ఈ పానీయం కణాల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. కాబట్టి ప్రతి ఉదయం కొబ్బరి నీళ్ళు తాగటం అలవాటు చేసుకోండి.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights