Teluguwonders:
బిగ్ బాస్ రియాలిటీ షో.. 15 మంది సెలబ్రిటీలను ఒక ఇంటిలో ఉంచి వాళ్ల ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఎంటర్‌టైన్ చేయడమే ఈ గేమ్ ఉద్దేశం. ఇందులో వివాదాలది అగ్రతాంబూలం అయితే.. గొడవలు, గోలలు, గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, అలకలు, బుజ్జగింపులు ఇలా చాలానే ఉంటాయి. వీటిన్నింటితో పాటు అందమైన ముద్దుగుమ్మలు ఇంట్లో ఉంటే.. మగ రత్నాలు చూస్తూ ఊరుకోరుగా.. ఎవరికి నచ్చనట్టువాళ్లు పులిహోర కలిపి ఆ ముద్దుగుమ్మలతో లవ్ ట్రాక్ నడిపేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తారు.
👉వేరే బిగ్ బాస్ హౌస్‌ల మాదిరే..,:
లవ్ ట్రాక్స్ లేని బిగ్ బాస్ హౌస్.. ఉప్పులేని కూర లాంటిదే అనుకున్నారో ఏమో కాని సీజన్ 3లో కొత్త కథ మొదలైంది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లోనూ లవ్ ట్రాక్ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అంతే కాదు డేటింగ్, రొమాన్స్ అంటూ గుసగుసలు మొదలయ్యాయి కూడా.
💗లవ్ గేమ్ స్టార్ట్ అయ్యింది !! :
బిగ్ బాస్ హౌస్‌లో కి గ్లామర్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన పునర్నవి భూపాలంతో లవ్ గేమ్ స్టార్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్. గత వారం ఈ ఇద్దరి మధ్య లవ్ అండ్ డేటింగ్‌పై ఆసక్తికరమైన చర్చ నడించింది. డేటింగ్ చేస్తావా? అని పునర్నవిని అడిగితే నా రిలేషన్ స్టేటస్ నీకు తెలుసా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని సున్నితంగా తిరస్కరించింది.అయితే రాహుల్ మాత్రం పునర్నవి కోసం పులిహోర కలపడంలో బిజీగానే ఉన్నాడు.
🔴అన్ టోల్డ్ స్టోరీస్ పేరుతో :
మరోసారి ఈ డేటింగ్ విషయంపై ఈ ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. దీన్ని ప్రసారం చేయకుండా దాచేసిన బిగ్ బాస్ నిర్వాహకులు.. అన్ టోల్డ్ స్టోరీస్ పేరుతో మా మ్యూజిక్‌లో విడుదల చేస్తున్నారు.ఈ సీక్రెట్ వీడియోలో.. పునర్నవి, రాహుల్‌లు పక్క పక్కనే కూర్చుని ఉండగా.. ‘నుమ్ ఏంటి మెంటల్ వాడిలా మాట్లాడతావ్.. ఇంట్లో వాళ్లతో పాటు నాగార్జున గారు కూడా లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ అంటానే ఉన్నారు. నువ్ వాళ్లను ఒక్క మాట అనలేదు. నాగార్జున గారు డేటింగ్ అంటే.. పునర్నవి అన్నారు. ఆ డేటింగ్ వల్లే నిన్ను సేఫ్ చేశారని అంటుంటే నువ్ సైలెంట్‌గా ఎందుకు ఉన్నావు.
నేను చెప్పాను కదా.. అలాంటిది ఏం లేదు సార్.. తనతో సరదా కోసమే అలా ఉన్నా.. మాది ప్యూర్ ఫ్రెండ్ షిప్ అని చెప్పబోతున్నా.. ఇంతలో నాగార్జున గారు ఆపు రాహుల్ అనేశారు. ఇక నేను చేసేది లేక సైలెంట్‌గా ఉండిపోయా అని పునర్నవి కి సర్ధిచెప్పారు రాహుల్.
ఇక పక్కనే ఉన్న వితికా షెరూని పిలిచి పునర్నవి ఏం అంటుoదో తెలుసా? తనతో డేటింగ్ వల్లే నన్ను ఎలిమినేట్ చేయకుండా ఉంచారని అనుకుంటున్నారట అని రాహుల్ చెప్పడంతో.. అరే ఆమె అలా అనలేదు నీకు సరిగా అర్ధంకాలేదని చెప్పుకొచ్చింది వితికా. చివర్లో నా బతుకు ఏంటో జిందగీలో ఈ అమ్మాయినే కలవాలని ఉందేమో అని అనడంతో పునర్నవి.. రాహుల్ ముఖంపై చిటికెలు వేస్తూ ఆటపట్టిస్తోంది. మొత్తానికి ఈ వీడియో ద్వారా హౌస్‌లో లవ్ ట్రాక్ మొదలైందని హింట్ ఇస్తున్నారు బిగ్ బాస్.