ప్రేమ పెళ్లిపై కోపం… నిద్రలోనే కుమార్తె హత్య

Macherlaలో ప్రేమ పెళ్లి చేసుకుందనే కారణంతో ఓ తండ్రి తన కుమార్తెను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
చౌడేశ్వరి (22) తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం తండ్రి చంద్రశీనుకు ఆమోదం కాలేదు. కుటుంబ పరువు పోయిందనే భావనతో కక్ష పెంచుకుని, ముందుగా పథకం వేసుకుని నిద్రలో ఉన్న సమయంలో దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.
తర్వాత ఈ ఘటనను ఆత్మహత్యలా చూపించేందుకు ప్రయత్నించినా, పోస్టుమార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన పరువు పేరుతో జరిగే హత్యలపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
