తగ్గేదేలే.. విమానంలో టీ కోసం వివాదం.. చెట్టంత మగాడిని చితకబాదేసిన మహిళ..

fighting-in-flight

గత కొంత కాలంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లలో సీట్ల కోసం.. మెట్రో లో సీట్ల కోసం సిగపట్లు పట్టుకోవడం.. కొంచెం ముందుకు వెళ్లి ఆడ మగ అనే తేడా లేకుండా కలబడడం చూస్తున్నాం… ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా ప్రీ బస్సు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ రొటీన్ అనుకుంటున్నారా.. అయితే ప్రస్తుతం ప్రయాణంలో ప్రయాణీకులు కొట్టుకుంటున్న సరికొత్త వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కొట్లాటకు వేదిక విమానం..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వీడియో ప్రత్యక్షం అవుతుంది. బస్సుల్లో, ట్రైన్స్ లో, మెట్రోల్లో బూతులు తిట్టుకోవడం.. ఒకరిపై మరోకరు పిడిగుద్దులతో దాడి చేసుకుంటున్నారు. ఇలాంటి తగవులను అడ్డుకోవడానికి వెళ్తే.. అలా వెళ్లినవారికి కూడా వడ్డిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు రొటీన్ అనుకుంటూనే.. ఏమిటి నేటి తరం తీరు అని ఆలోచిస్తూ.. ఆ  వీడియోలు చూస్తూ నవ్వుకునేవరున్నారు. అయితే ఇప్పుడు ప్రయాణం చేస్తూ కొట్టుకోవడం అనే కల్చర్ విమానాల్లోకి పాకినట్లు ఉంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇద్దరు ప్రయాణీకుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతుంది.

ఎయిర్ ఇండియా రన్నింగ్ విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఒక మహిళ.. తోటి ప్రయాణికుడితో గొడవకు దిగింది. కోల్డ్ టీ కోసం గొడవ పెట్టుకొని అతడిపై ముష్టి ఘాతాలు కురిపించింది. ఇద్దరూ తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పీకలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేస్తూ.. పిడి గుద్దులతో కొట్టుకున్నారు. ఈ ఇద్దరి గొడవని ఆపడానికి అక్కడే ఉన్న ఎయిర్ హోస్టెస్ లు ఆపేందుకు ప్రయత్నించారు. అయినా ఇద్దరూ ఎక్కడా మేము తగ్గం అన్నట్లు దాడి చేసుకుంటూనే ఉన్నారు. విమానంలో ఘోరంగా కొట్టుకుంటున్న ఇద్దరినీ తోటి ప్రయాణీకులు చూసి షాక్ కు గురయ్యారు.

 

ఆకాశంలో కలబడ్డ ప్రయాణీకులు

విమానంలో ఎక్కువగా ప్రయాణించే వారు అత్యంత ప్రొఫెషనల్స్ గా ఉంటారు. అక్కడ కూడా గల్లీని తలపించే సీన్ కనిపిస్తే ఏమనాలి అంటున్నారు కొందరు. ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు రోజు రోజుకీ మనుషులు ఇలా తయారయ్యారావుతున్నారు ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ భయ్యా.. ఎందుకైనా మంచిది ఆమెకు దూరంగా ఉండూ లేకుంటే విమానంలో నుంచి తోసేస్తుందని సరదాగా కామెంట్ చేస్తున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights