Gold Price: దంతేరాస్ ముందు మహిళలకు దిమ్మదిరిగే షాక్.. బంగారంపై 3,200, వెండిపై 4,000 పెరుగుదల

Gold Price: దీపావళికి ముందే బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిరంతరం పెరుగుతున్న ధరలు కస్టమర్లను, వ్యాపారులను దిగ్భ్రాంతికి గురిచేశాయని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వివాహాలు ప్రారంభమవుతాయి. దీంతో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని..
Gold Price: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. కనీసం గ్రాము బంగారం కొనాలంటేనే సామాన్యులు భయపడిపోతున్నాయి. ఇప్పుడు దంతేరాస్, దీపావళి పండగకు ముందు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా అక్టోబర్ 14వ తేదీన దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి బంగారం, వెండి ధరలు. ఉదయం 6 గంటల సమయంన ఉంచి 9 గంటల వరకు అంటే కొన్ని గంటల్లోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం తులం బంగారంపై ఏకంగా రూ.3,280 పెరిగింది. అదే వెండిపై ఏకంగా రూ.4000 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా వెండి కిలో ధర రూ.1,89,000 వద్ద ఉంది.
దేశీయంగా ధరలను చూస్తే.. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,680 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,950కి చేరుకుంది. అదే 18 క్యారెట్ల ధర రూ.97,700 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,950 వద్ద ఉంది. ఇక వెండి ధర రూ.2,06,000 వద్ద ఉంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
