దేశ ప్రజలకు శుభ వార్త ; రుతు పవనాలు…మీ గుమ్మం లోకి వచ్చేస్తున్నాయి..

సాధారణంగా ఎండ తీవ్రత గురించి చెప్పడానికి ఎండలు మండిపోతున్నాయి అంటారు . నిజంగా ఈ సమ్మర్ ఆ మాటను నిజం చేసింది.
🔴నిప్పుకు మళ్ళీ నిప్పు తోడయినట్టు: నిజంగానే ఎండలు మండిపోయాయి ఈ సమ్మర్ లో.నిప్పుకు నిప్పు తోడయినట్టు గా దానికి రోహిణి కార్తీ కూడా తోడవ్వడంతో ఆ మంటలు ఇంకా చెలరేగాయి.
దేశవ్యాప్తంగా భానుడు తన ప్రతాపం కొనసాగిస్తున్నాడు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
🔥రాజస్థాన్‌లో నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతలు :రాజస్థాన్‌లోని చురులో అత్యధికం గా 50 డిగ్రీలు కూడా దాటిపోయింది.
🎊రుతుపనాల రాక కాస్త ఆలస్యం అయ్యింది : నిజానికి ఈ నెల 1న రావాల్సిన రుతుపవనాలు రాక ఒక వారం ఆలస్యం అయినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 1న రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉందని అయితే, వారం రోజులు ఆలస్యమయ్యాయని,ఐఎండీ తెలిపింది. 👉రుతుపవనాలు ఈ నెల 8న అంటే రేపు కేరళను తాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. అదే జరిగితే క్రమంగా అవి ఉత్తరంవైపుగా పయనించి దేశం మొత్తం విస్తరిస్తాయని వివరించింది.
⛈ముందుగా చెప్పినట్టే అక్కడక్కడా వర్షాలు : ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా జూన్ 4-7 మధ్య రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని పేర్కొంది. చెప్పినట్టుగానే అప్పుడు వర్షాలు అక్కడక్కడా మొదలయ్యాయి.
💦ఇక వర్షాలు వచ్చేస్తాయి :జూన్ 6 నాటికి నాలుగు రోజులు అటూఇటుగా రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని గత నెలలో ఐఎండీ అధికారులు తెలిపారు. కాగా, వాతావరణ శాఖ చెప్పినట్టు రేపు కనుక రుతుపవనాలు కేరళను తాకితే వాతావరణం కొంత చల్లబడి వర్షాలు గట్టిగా కురిసే అవకాశం ఉంది. దాంతో అందరికీ ప్రాణం లేచొస్తుంది.హాయి గా ఉంటుంది.
