ఏపీలో హంగ్ రాబోతుంది : జ్యోతిష్య పండితుల తీర్మానం

గ్రహాల దిశ, పరిణామాలను బట్టీ చూస్తే… జనసేన మద్దతు అవసరం అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పయ్యాయని చెబుతున్నారు. 👉జ్యోతిష్యాన్నీ, గ్రహాలనూ చాలా మంది నమ్మరు. అయినప్పటికీ అసలు అవేం చెబుతున్నాయో సరదాగా తెలుసుకుందామన్న ఆసక్తి మాత్రం చాలా మందికి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు రావడానికి మనం రేపటి వరకూ వెయిట్ చెయ్యకుండా… ఈలోపు గ్రహాలు ఎలా ఉన్నాయో, వాటి ద్వారా ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలుసుకుందాం. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం చూశాం. అప్పటికే ఓ అంచనాకి వచ్చినా, ఏపీలోని అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలూ తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నాయి. సొంతంగానే మెజార్టీ సాధించుకుంటామని అంటుంటే, . ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇతర పార్టీల మద్దతు కావాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి.
🔥జ్యోతిష్య పండితులు ఫైర్ :
ఎగ్జిట్ పోల్స్‌ని చూసిన జ్యోతిష్య పండితులకు ఒళ్లు మండింది. అవి పూర్తిగా అబద్ధాలు చెబుతున్నాయని ఫైర్ అయ్యారు ఢిల్లీలో జ్యోతిష్య శాస్త్రంలో గోల్డ్ మెడల్ కొట్టిన శైలేంద్ర శర్మ. ఏప్రిల్ 11 నుంచీ మే 19 వరకూ ఎన్నికలు జరిగిన 7 దశలూ చూస్తే… గ్రహాలు ఏ పార్టీకీ అనుకూలంగా లేవని ఆయన అంటున్నారు. 👉కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా సరే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచెయ్యలేరని తేల్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కి ప్రధాని అయ్యే భాగ్యం లేదట. NDA పక్షాలన్నీ కలిసినా మేజిక్ ఫిగర్ (272) రాదట. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ లేదా వైసీపీ మద్దతు తప్పనిసరి అంటున్నారు.
♦ఏపీలో హంగే : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలేమన్నాయి… వైసీపీ అధికారంలోకి వస్తుందని కొన్నీ, కాదు టీడీపీ వస్తుందని కొన్నీ చెప్పాయి కదా. జ్యోతిష్య పండితులు మాత్రం రెండు పార్టీలకూ సొంతంగా మెజార్టీ (88) స్థానాలు రావని అంటున్నారు.
👉జనసేన సపోర్ట్ తప్పనిసరి : ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్లు జనసేన మరీ అంత వీక్‌గా ఏమీ లేదట. దాని ప్రభావం ఉందట. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జనసేన మద్దతు తప్పనిసరి అంటున్నారు జ్యోతిష్య పండితులు.
ప్రధానంగా కొందరు చెబుతున్నట్లుగా కాపు వర్గానికి సంబంధించిన పార్టీ జనసేన దాదాపు 70 అసెంబ్లీ స్థానాలపై తన ప్రభావం చూపించగలదంటున్నారు జ్యోతిష్యులు. ఆ 70లో ప్రతీ అసెంబ్లీ స్థానంలో 40 నుంచీ 90 వేల మంది కాపులు ఉన్నారనీ వాళ్లు జనసేనవైపు మొగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
మరి వచ్చేది హంగో..కింగో.. రేపేమనకు తెలిసిపోతుంది.అప్పటి వరకూ control your breathe…
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.

May I just say what a relief to uncover someone that truly understands what they are discussing on the net.
You certainly know how to bring an issue to light and make it important.
More people have to check this out and understand this side of your story.
It’s surprising you aren’t more popular since you definitely
possess the gift.