Hyderabad: మియాపూర్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన మియాపూర్‌లోని మక్తా మహబూబ్‌పేటలో జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని.. వివరాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన మియాపూర్‌లోని మక్తా మహబూబ్‌పేటలో జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. మృతులు నర్సింహ (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24), అప్పు (2)గా పోలీసులు నిర్ధారించారు. కర్ణాటక గుల్బర్గా లక్ష్మయ్య కుటుంబం గత కొంత కాలం నుంచి హైదరాబాద్ లో నివసిస్తోంది.. లక్ష్మయ్యకు ముగ్గురు కూతుర్లు.. కాగా.. నర్సింహా, అతని భార్య వెంకటమ్మ దంపతులు, రెండవ కూతురు, అల్లుడు పాపతో మక్తా మహబూబ్‌పేటలో నివిసిస్తున్నాడు.. లక్ష్మయ్యతోపాటు కుటుంబం మొత్తం కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది.
ఈ క్రమంలోనే వీరంతా బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో రెండవ కూతురు, అల్లుడు పాపతో సహా లక్ష్మయ్య అతని భార్య వెంకటమ్మ మృతి చెందారని పోలీసులు తెలిపారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమా..? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడం స్థానికంగా కలకలం రేపింది.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
