ఇండియాలో ఆ ఉగ్రవాద సంస్థ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరిచిందా..??

ఉగ్రవాద సంస్థ ఐసిస్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్న కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ సంచలన ప్రకటన చేసింది.
🔴‘విలయ ఆఫ్ హింద్’ : ఇండియాలో తాము ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేశామని ఉగ్రవాద సంస్థ ఐసిస్ సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రావిన్స్‌కు ‘విలయ ఆఫ్ హింద్’గా పేరు పెట్టినట్లు వెల్లడించింది. కాశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన తర్వాత ఈ ప్రకటన చేసింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది.షోపియాన్ జిల్లాలోని అమ్షిపొరాలో తాము జరిపిన దాడిలో భారత ఆర్మీకి భారీగా ప్రాణనష్టం మిగిల్చినట్లు ఐసిస్ కు చెందిన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 🔴ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రతిస్పందన : ఐసిస్ ప్రకటనపై ఎస్ఐటీఈ (సెర్చ్ ఫర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఎంటిటీస్) ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కట్జ్ స్పందిస్తూ, కాశ్మీర్‌లో ఐసిస్ ఉనికే లేదని, అలాంటప్పుడు ఇక్కడ ఓ ప్రావిన్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పడం పూర్తిగా అసంబద్ధమని అన్నారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా వదిలేయడానికీ లేదని చెప్పారు. కానీ ఇండియాలో నిజంగానే ఉగ్రవాదులు ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచి ఉంటే..జరిగబోయే పరిణామాలు..ఎంత భయంకరంగా ఉంటాయో తెలియదు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
