IB Job Notification 2025: పదో తరగతి అర్హతతో.. ఇంటలీజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు! లక్షల్లో జీతం..

intelligence-bureau-jobs

ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సీడరీ ఇంటలిజెన్స్‌ బ్యూరోల్లో (SIBs) విధులు నిర్వహించవల్సి ఉంటుంది..

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 455 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 7, ఆంధ్రప్రదేశ్‌లో 9 పోస్టుల వరకు ఉన్నాయి. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సీడరీ ఇంటలిజెన్స్‌ బ్యూరోల్లో (SIBs) విధులు నిర్వహించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 28, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెక్యూరిటీ అసిస్టెంట్‌ (మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యూలేషన్‌)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే వారి వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. మోటార్ మెకానిజం పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. లైసెన్స్ పొందిన తర్వాత కనీసం ఏడాది డ్రైవింగ్ అనుభవం పొంది ఉండాలి. అలాగే అభ్యర్థి దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన డొమైన్‌ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంటే ఇంకా మంచిది.

దరఖాస్తుదారుల వయోపరిమితి సెప్టెంబర్‌ 28, 2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసులో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ పురుష అభ్యర్ధులు రూ.650, ఎస్సీ, ఎస్టీ, మహిళలలు, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. టైర్‌-1, టైర్‌-2 రాత పరీక్షలతోపాటు డ్రైవింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం ఇలా..

టైర్‌ 1 రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు గంట సమయంలో నిర్వహిస్తారు. టైర్‌1లో జనరల్ అవేర్‌నెస్‌ 20 మార్కులకు, ట్రాన్స్‌పోర్ట్‌/డ్రైవింగ్‌ రూల్స్‌కు 20 మార్కులకు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 20 మార్కులకు, రిజనింగ్‌ 20 మార్కులకు ఉంటుంది. నెగటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ఇక టైర్‌ 2 పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ఆ తర్వాత డ్రైవింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 6, 2025.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 28, 2025.
  • చెలాన్‌ ద్వారా ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 30, 2025.
  • రాత పరీక్ష తేదీలు: త్వరలోనే ప్రకటిస్తారు.

Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights