February 26, 2026

చిరుతో ఐటమ్‌ సాంగ్‌.. హాట్‌ బ్యూటీకి క్రేజీ ఆఫర్‌……

హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా.. స్టార్‌ ఇమేజ్‌ అందుకోలేకపోయిన బ్యూటీ రెజీనా కాసాండ్ర. పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ రోల్స్‌లో పాటు గ్లామర్‌ క్యారెక్టర్స్‌కు కూడా సై అన్నా ఈ భామకు అవకాశలు మాత్రం రావటం లేదు. ఇటీవల ఎవరు సినిమాలో నెగెటివ్ రోల్‌లోనూ మెప్పించిన రెజీనాకు స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ దక్కకపోయినా వరుస సినిమాలు చేస్తోంది.

తాజాగా ఈ భామకు ఓ క్రేజీ ఆఫర్‌ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 152వ సినిమాలో రెజీనా నటించనుంది. అయితే ఈ సినిమాలో రెజీనా నటించబోయేది ఓ ప్రత్యేక గీతంలో అన్న టాక్‌ వినిపిస్తోంది. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించే స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రెజీనా స్పెషల్‌ సాంగ్‌లో నటించనుందట. చిరుతో డ్యాన్స్‌ చేసే ఛాన్స్‌ రావటంతో రెజీనా కూడా స్పెషల్‌ సాంగ్‌కు వెంటనే ఒప్పేసుకుంది.

గతంలో చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్‌ 150 షూటింగ్ సమయంలో ఇలాంటి రూమర్సే వినిపించాయి. ఆ సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ చేస్తుందన్న ప్రచారం గట్టిగా వినిపించింది. అయితే ఫైనల్‌గా ఆ అవకాశం రాయ్‌ లక్ష్మీని వరించింది. ఇప్పుడు మరోసారి అదే తరహా వార్తలు రావటంతో ఎంత వరకు కరెక్ట్ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. చాలా కాలం తరువాత చెన్నై చంద్రం త్రిషా, మెగాస్టార్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థతో కలిసి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. చాలా కాలం తరువాత మణిశర్మ ఈ సినిమాతో మెగాస్టార్‌కు సంగీతమందిస్తున్నాడు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading