హైదరాబాద్ అభివృద్ధి పేరుతో అవినీతి? కవిత విమర్శలు..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన అంశం జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టుల వ్యవహారం. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో Kalvakuntla Kavitha సంచలన ఆరోపణలు చేశారు.
జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతి చేస్తున్నదని, టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ₹1,148 కోట్ల పనులు అనుచరులకు కేటాయించారని సీఎం Revanth Reddy పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“టెండర్లు లేకుండా కాంట్రాక్టులు ఇవ్వడం తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్‌కు విరుద్ధం” అని ఆమె పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఈ విధానం అనుసరించినా, ప్రస్తుత ప్రభుత్వం మరింతగా పెంచిందని ఆరోపించారు.
అలాగే హైదరాబాద్ అభివృద్ధి పేరుతో హెచ్‌ఎండీఏ పరిధిలో భారీగా ఆదాయం వచ్చినప్పటికీ, నగర సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని కవిత విమర్శించారు. వర్షం పడితే ట్రాఫిక్ జామ్‌లు, నీటి నిల్వలు ఇంకా పరిష్కారం కాలేదని ఆమె ప్రశ్నించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
