March 31, 2026

కృష్ణా జిల్లాలో భయానక ఘటన.. పోలీస్ జీప్‌లో టపాసుల పేలుడు…

police_blast_logo

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చల్లపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన వాహనంలో ఆకస్మికంగా పేలుడు సంభవించి, ఎస్సై సహా నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

దీపావళి సందర్భంగా స్వాధీనం చేసుకున్న టపాసులను తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న టపాసులు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది.

గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగినదా లేదా ఎవరి ప్రమేయం ఉందా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading