March 31, 2026

యుద్ధ ఉద్రిక్తతల మద్య విషాదం.. కువైట్‌లో భారతీయుడు మృతి

kuwait_news_with_logo

కువైట్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు పెరుగుతున్నాయి.తాజాగా ఇరాన్ కువైట్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, నీటి శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడిలో అక్కడ పని చేస్తున్న ఓ భారతీయ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యమైన పరిశ్రమలు, మౌలిక వసతుల వద్ద అదనపు భద్రతా చర్యలు చేపట్టింది.ఇక అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం గ్లోబల్ స్థాయిలో ఆందోళనలకు దారితీస్తోంది.భారత ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందిస్తూ గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో సమీప భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading