అన్నదాత లకు శుభవార్త : రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత లకు చెందిన సహకార బ్యాంకులు, సంఘాలలోని రుణాలన్నింటినీ జూన్ నెలాఖరుకు మాఫీ చేస్తామని సహకార శాఖామంత్రి బండెప్ప కాశంపూర్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రూ.2600ల కోట్లు విడుదల చేశామన్నారు. ఇందులో రెండువేల కోట్ల మేరన రైతుల ఖాతాలకు చేరిందని ఇంకా రూ.600ల కోట్లు జమలు కాలేదన్నారు. అంతలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అసాధ్యమైందన్నారు.
అదేరీతిన జాతీయ బ్యాంకులకు సంబందించి రూ. 2800 ల కోట్లు విడుదల చేశామన్నారు. రుణమాఫీ అంశానికి కట్టుబడి ఉన్నామని అందుకు సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మండ్య స్వతంత్ర అభ్యర్థి సుమలత అనుచిత వ్యాఖ్యలకు పరోక్షంగా తిప్పికొట్టారు.