నాగార్జున-అమల : ఎవర్ గ్రీన్ love couple

Spread the love

27 ఏళ్ల క్రితం సరిగ్గా జూన్ 11న నాగార్జున, అమల పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం వెనక పెద్ద సినీ ప్రయాణమే ఉంది.. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్లు ఇలా ఒకింటి వారయ్యారు. దీనికి బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్ మినహాయింపు కాదు. తెలుగులో సినిమాల్లో కలిసి నటించిన తర్వాత ఒకింటి వాళ్లైన జంటల్లో నాగార్జున, అమల ఒకరు.

💖వారి ప్రేమ ప్రయాణం అలా మొదలయ్యింది : ఫస్ట్ టైమ్ వీళ్లిద్దరు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిరాయి దాదా’లో మొదటిసారి కలిసినటించారు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ‘చినబాబు’‘శివ’,‘ప్రేమ యుద్ధం’,హిందీలో శివ రీమేక్ శివ సినిమాతో పాటు ‘నిర్ణయం’ వంటి ఐదు సినిమాల్లో జంటగా నటించారు.వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన ‘శివ’ సినిమా తప్పించి మరే సినిమా విజయాన్ని అందుకోలేకపోయిన ‘శివ’ సినిమాతో మొదలైన వీరి ప్రేమాయణం ‘నిర్ణయం’ సినిమాతో పీక్స్‌కు చేరుకుంది.

💖ఆ శుభ ముహూర్తం : 27 ఏళ్ల క్రితం సరిగ్గా జూన్ 11న ” హలో* ప్రేమ కోసమే జీవితం …” అంటూ పాట పాడి మరి అమలను పెళ్లి చేసుకున్నాడు. ‘నిర్ణయం’ సినిమా ఫ్లాపైనా.. వీళ్లిద్దరి లైఫ్ సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది.ఆ తర్వాత మహేష్-నమ్రత,పవన్-రేణు దేశాయ్(మాజీ),శ్రీకాంత్-ఊహ వంటి మరెన్నో సినీ ప్రేమ జంటలకు ఈ ప్రేమ జంట ఆదర్శం గా నిలిచింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading