Teluguwonders: పిల్లల చదువు కోసం తమ జీవితాలను ధారపోస్తారు తల్లిదండ్రులు. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు.. పిల్లలు బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో స్థిరపడాలని,పిల్లలను బాగా చదివించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అసలు ఆలా కోరుకోని తల్లిదండ్రులు ఉండరు అనుకున్నాం నిన్నటి వరకు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ దారుణం తెలియనంత వరకు . ఎందుకంటే అక్కడ కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిని కడతేర్చాలని చూశాడు. ఆమెను కత్తితో పొడిచాడు. దీనికి కారణం ఏంటని
👉వివరాల్లోకి వెళ్తే :
షాజహాన్ పూర్ లో ఈ ఘోరం జరిగింది. తన 15 ఏళ్ల కూతురికి పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించాడు. పెళ్లి చేసుకునేందుకు ఆ అమ్మాయి అంగీకరించలేదు. నాకు చదువుకోవాలని ఉంది.. పెళ్లి వద్దు అని అమ్మాయి తండ్రితో తేల్చి చెప్పింది.
🔴దీంతో ఆ తండ్రి, అన్న..కలిసి : కూతురి మాట విన్న ఆ తండ్రి కి కోపం కట్టలు తెంచుకుంది. నాకే ఎదురు చెబుతావా అని కూతురిని తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత నిర్మానుషమైన ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లాడు. అక్కడికి అమ్మాయి సోదరుడు కూడా వచ్చాడు. చెల్లిని కాపాడాల్సిన అన్న.. తండ్రికి సహకరించాడు. అరవకుండా వస్త్రంతో చెల్లి నోటిని మూసేశాడు. ఆ తర్వాత తండ్రి తన వెంట తెచ్చుకున్న కత్తితో కూతురిని పలు మార్లు పొడిచాడు. నన్ను వదిలేయి నాన్నా అని ఆ అమ్మాయి ఎంత వేడుకున్నా.. ఆ కసాయి తండ్రి మనసు కరగలేదు.
కత్తితో పొడిచిన తర్వాత ఆ తండ్రి, కొడుకు కలిసి.. అమ్మాయిని కెనాల్ లోకి విసిరేశారు. కూతురు చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
🔴కానీ ఆ తర్వాత : కొనఊపిరితో ఉన్న అమ్మాయి ఎలాగో అలా ఈదుకుంటూ ఒడ్డుకి చేరుకుంది. అక్కడి నుంచి తన అక్క ఇంటికి వెళ్లింది. జరిగిన దారుణాన్ని అక్కబావలకి వివరించింది. వారు అమ్మాయిని చేరదీశారు. అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. దీనిపై బాధితురాలు, ఆమె అక్కబావలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. . కసాయి తండ్రితో పాటు అతడికి సహకరించిన కొడుకుపై కేసు నమోదు చేశారు. 👉ఈ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.దర్యాఫ్తు చేపట్టామని.. ఆధారాలు సేకరిస్తున్నామని తప్పు చేసినట్టు తేలితే ఆ తండ్రి, కొడుకులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెప్పారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.