Teluguwonders:
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత బ్రాంచుల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.
వయసు: 2020, జనవరి 1 నాటికి వాటర్ కమిషన్, పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏళ్లు; మిగిలిన వాటికి 30 ఏళ్లు ఉండాలి.
ఓబీసీలకు మూడేళ్లు:
ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్), పేపర్-2 (డిస్క్రిప్టివ్ టైప్) పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: జేఈ ఎగ్జామినేషన్‌ను రెండు దశల్లో (పేపర్-1, 2) నిర్వహిస్తారు. 500 మార్కులకు జరిగే ఈ పరీక్షల్లో పేపర్-1కు 200 మార్కులు, పేపర్-2కు 300 మార్కులు కేటాయించారు.
పేపర్-1: ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇందులో 200 మార్కులకు గాను 200 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఇంజనీరింగ్ (ఆప్షనల్ సబ్జెక్ట్) నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న లన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు పేపర్-2 పరీక్షకు అర్హులు.
పేపర్-2: ఇది డిస్క్రిప్టివ్ టైప్ పరీక్ష. మొత్తం 300 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్ సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు సివిల్ అండ్ స్ట్రక్చరల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పేపర్-2 పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాత పూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులుండవు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: నెల్లూరు, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు).
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 12, 2019.
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ: సెప్టెంబర్ 14, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.