Latest

    కరోనా కట్టడికి 15 సూత్రాలు

    *కరోనా కట్టడికి 15 సూత్రాలు..* *వీటిని తప్పకుండా పాటిస్తే వైరస్‌ వ్యాప్తిని అరికట్టొచ్చు* *

    చిత్రాత్మక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ*

    కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా 15 జాగ్రత్తలతో కూడిన ఇలస్ట్రేటివ్‌ గైడ్‌ విడుదల చేసింది. ఈ సూత్రాల ఆధారం గా మనమంతా జాగ్రత్తగా ఉంటే కరోనాపై గెలుపు సాధిస్తామని సూచించింది. మరింత సులువుగా అర్థం చేసుకునేలా చిత్రాత్మక మార్గదర్శకాలను వైబ్‌సైట్‌లో ఉంచింది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా యి.

    ◆ అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావొద్దని, ముఖ్యంగా పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఇల్లు విడిచి రావొద్దని మార్గదర్శకాల్లో కేంద్రం సూచించింది.

    *ఆ 15 సూత్రాలివే..*

    ◆ పలకరింపును భౌతిక స్పర్శతో కాకుండా దూరంగా నమస్కారం చేయాలి.

    ◆ వ్యక్తికి, వ్యక్తికి మధ్య కనీసం 2 గజాల (6 అడుగులు) దూరాన్ని పాటించాలి. ముఖానికి మాస్కు ధరించాలి.

    ◆ కళ్లను, నోరు, ముక్కును చేతితో తాకకూడదు.

    ◆ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల్లేకుండా పరిశుభ్రత చర్యలు పాటించాలి.

    ◆ చేతులను శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.

    ◆ బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం, పాన్‌మసాలా తిని ఉమ్మివేయొద్దు.

    ■ తరచుగా తాకే ప్రదేశాలు, వస్తువులను డిస్‌ఇన్ఫెక్ట్‌ చేయాలి.

    ◆ అనవసర ప్రయాణాలు మానుకోవాలి. ◆ ఇతరుల పట్ల వివక్ష చూపకూడదు.

    ◆ సమూహాలుగా గుమిగూడటం మానుకోవాలి.

    ◆ అసత్య వార్తలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయొద్దు.

    ◆ కరోనా సమాచారాన్ని విశ్వసనీయత కలిగిన వ్యక్తులు, సంస్థల నుంచి తెలుసుకోవాలి.

    ◆ సందేహాలుంటే జాతీయ హెల్ప్‌లైన్‌ 1075, రాష్ట్ర హెల్ప్‌లైన్‌ 104కు ఫోన్‌ చేయాలి..

    ◆ ఒత్తిడి, ఆత్రుతకు గురైతే నిపుణుల సహకారం తీసుకోవాలి.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading