ఎన్నికల హామీలో చెప్పినట్టే జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేయబోతున్నారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మద్యనిషేధం పెట్టినప్పటికీ అనేక పరిణామాల అనంతరం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పలు కారణాల వల్ల ఆనాడు మద్యనిషేదాన్ని ప్రభుత్వం అమలు చేయలేక పోయింది.
అయితే జగన్ ఈ విషయంలో చాలా పకడ్బందీగా తన ప్లాన్ అమలు చేయబోతున్నారు. చాలా పేద కుటుంబాలు మద్యం వల్ల కుదేలయిపోవడం వల్ల ,ఎన్ని పథకాలు అమలు చేసినా, సామాజిక మార్పు రావడంలేదని గమనించిన జగన్ ఈ అంశం పట్ల సీరియస్‌గా ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు మేలు జరగాలంటే మద్యనిషేధం అమలు జరిగి తీరాలని ఈ ఆలోచన జగన్‌కి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డిదని వైసీపీ నాయకులంటున్నారు.
ఈ నేపధ్యంలో జగన్ ఆదివారం ,ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. 🔴ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో మాత్రమే మద్యం ; మద్యపాన నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీని వల్ల ముందు సామాన్యులను ఈ వ్యసనాన్కి దూరం చేసి, కుటుంబాలను కాపాడ వచ్ఛని జగన్ భావిస్తున్నారు. 👉పథకం కొత్తగానే ఉంది కానీ మందు బాబుల కుటుంబాలకు..మేలు చేస్తేనే.. ఈ పథకం వల్ల ఉపయోగం..అంటున్నారు విశ్లేషకులు