నాగిని భామ సర్జిరీ చేయించుకుంది.. మరి ఆతర్వాత కథ షరా మాములే..
బాలీవుడ్ భామల సర్జిరీ ల పిచ్చి : బాలీవుడ్ భామలకు నేచురల్ అందాల మీద నమ్మకం ఉండదు. మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి చాలామంది ప్లాస్టిక్ సర్జరీల్ని ఆశ్రయిస్తుంటారు. ఒంటిలో అనేక భాగాల మీద ప్రయోగాలు చేస్తుంటారు. ఎద సౌందర్యం పెంచుకోవడానికి సర్జరీలు చేసుకునేవాళ్లు కొందరైతే.. ఇంకొందరు ముక్కును.. పెదవుల్ని.. బుగ్గల్ని.. గడ్డాన్ని సరి చేసుకుంటూ ఉంటారు.
ప్లాస్టిక్ సర్జరీల వల్ల అందాన్ని దెబ్బ తీసుకున్న భామలు :
మొన్నీ మధ్య శ్రుతి హాసన్‌కు ప్లాస్టిక్ సర్జరీ కొంత మేర నష్టమే చేసింది.
ఆ మధ్య ఆయేషా టకియా ఇలాగే సర్జరీకి వెళ్లి తనకున్న ఆకర్షణ మొత్తం కోల్పోయింది. ఆమెను అప్పట్లో జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు.
శ్రీదేవి ని మినహాయిస్తే :
అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి ముక్కుతో పాటు బ్రెస్ట్ సర్జరీ కూడా చేయించుకుంది. ఐతే ఆమెకు కుదిరినట్లుగా అందరికీ కుదరలేదు. .
తాజాగా నాగిని (మౌని రాయ్ ) సర్జరీ ఫెయిల్యూర్ :
తాజాగా మరో బాలీవుడ్ భామ సర్జరీతో తన అందాన్ని దెబ్బ తీసుకుని ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఆమే.. మౌని రాయ్. టీవీ రంగం నుంచి వచ్చి సినిమాల్లో అవకాశాలు అందుకున్న మౌని.. చాలా హాట్‌గా కనిపిస్తుంటుంది. సహజ అందంతోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మౌని.. ఈ మధ్యే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందం పెంచుకోవాలనుకుంది.కానీ సర్జరీ వికటించి ఉన్న అందం పోయింది. తాజగా ఒక ఫ్యాషన్ షోలో ఆమెను చూసి జనాలు షాకైపోయారు. ముఖంలో తేడా స్పష్టంగా కనిపించింది. సహజత్వం పోయింది. మొత్తంగా సర్జరీ తేడా కొట్టేసిన విషయం స్పష్టంగా తెలిసిపోయింది. దీంతో సోషల్ మీడియా జనాలు రెచ్చిపోతున్నారు. ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కృత్రిమ అందాలపై హీరోయిన్లకు ఇంత మోజేంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ మీద మౌని ఎలా స్పందిస్తుందో చూడాలి.దురాశ దుఃఖానికి చేటు అంటే ఇదే…అంటున్నారు చూసిన వారు…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.