లీకైన RRR సీన్లు …యాక్షన్ తీసుకున్న రాజమౌళి కొడుకు

Leaked RRR scenes ... Rajamouli's son who took action

Teluguwonders:

💥💥దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. బల్గేరియాలో ప్రస్తుతం తారక్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. చరణ్ తన పాత్ర కోసం రిహార్సల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో సెట్స్‌లోకి బాలీవుడ్ భామ ఆలియా భట్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ అడుగుపెడతారు. అయితే సినిమా టీం బల్గేరియాకు వెళ్లకముందు కోకాపేట్‌లో భారీ సెట్ వేసి కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.

ఓ భారీ సినిమా తెరకెక్కుతున్నప్పుడు ఎలాంటి సన్నివేశాలు లీకవకుండా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటుంది చిత్రబృందం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరో ఒకరు సన్నివేశాలను రహస్యంగా ఫోన్ కెమెరాలో షూట్ చేసి లీక్ చేసేస్తుంటారు. అలాంటివారిని చూసినప్పుడు కోపం కట్టలు తెంచుకురావడంలో తప్పు లేదు.

🔴సీన్లు లీక్ చేసిన వ్యక్తి.. :

ఫోన్ పగలగొట్టిన రాజమౌళి కుమారుడు. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు లీకుల పరిస్థితి ఎదురైంది.

🔴వివరాల లోకి వెళ్తే :

RRR సినిమా టీం బల్గేరియాకు వెళ్లకముందు కోకాపేట్‌లో భారీ సెట్‌ను ఏర్పాటుచేసి కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఆ సమయంలో ఓ వ్యక్తి సెట్‌లోకి చొరబడి కొన్ని సీన్లను తన ఫోన్ కెమెరాలో షూట్ చేశాడట. అది కాస్తా రాజమౌళి కుమారుడు కార్తికేయ కంటపడింది. అసలే భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో తీస్తున్న సినిమా. ఇలాంటి పన్లు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా.. వెంటనే సదరు వ్యక్తి వద్ద ఉన్న ఫోన్ తీసి నేలకేసి కొట్టి పగలగొట్టారట. అసలైతే ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి టీం కఠిన చర్యలు తీసుకునేదే. కానీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.

💥అప్‌డేట్ లేనందుకే ఇలా:

ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారని రాజమౌళి ఎప్పుడో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. చిత్రీకరణ చాలా రోజులుగా జరుగుతోంది. అయినప్పటికీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దాంతో అభిమానులు సినిమాలో ఏం ఉంటుందోనన్న ఆత్రుతతో ఉన్నారు. అందుకే ఇలా సన్నివేశాలను దొంగచాటుగా చిత్రీకరించడం వంటివి చేస్తున్నారు. నిర్మాతలు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రేక్షకుల కోసం భారీ సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు లీక్ చేయకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం బాధాకరం.

సినిమా ఎలాంటి లీకుల బారిన పడకుండా ఉంటే వచ్చే ఏడాది జులై 30న సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చక్కగా ఎంజాయ్ చేస్తారని, కక్కుర్తి పడి లీక్ చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చిత్రవర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ముందుజాగ్రత్తగా :

ఇలాంటివారి గురించి ఆలోచించే ముందుజాగ్రత్తగా రాజమౌళి ఓ నిర్ణయానికి వచ్చారట. అక్టోబర్ 22న తారక్ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తే కనీసం అభిమానులు కాస్త సంతోషిస్తారని అనుకుంటున్నారట. ఎంతో దాహం గా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ మాట నిజమైతే పెద్ద ఊరటే మరి.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights