*సమయపాలనకు ఇలా చేసి చూడండి!* *అనుకున్న పనిని అనుకున్న సమయానికి చేయడాన్నే సమయపాలన అంటారు.
కానీ, కొందరు మొదలు సమయం వృథా చేసి.. ఆఖరి నిమిషంలో కంగారుపడతారు. మరికొందరు సమయాన్ని పట్టించుకోకుండా, ఏ పని ఎప్పుడు చేయాలో తెలియకుండా వ్యవహరిస్తారు.
ఇలా చేయడం వల్ల పనికి, వ్యక్తిగత జీవితానికి సరైన సమయం కేటాయించలేరు. అందుకే, సమయపాలన పాటించడం కోసం ప్రణాళికలు వేసుకోవాలి. అదేలాగంటే..*
*⏱️పనుల జాబితా రాసుకోండి⏱️*
👉సమయపాలన పాటించాలనుకుంటే.. ఒకరోజు లేదా వారంలో చేయబోయే పనుల్ని ముందుగానే ఒక జాబితాగా రాసుకోండి. నిర్దేశించుకున్న సమయంలో ఏయే పనులు చేయాలి?ఎక్కడికి వెళ్లాలి? ఇలా వివరాలతో షెడ్యూల్ రూపొందించుకోండి. ఇందుకోసం ప్రత్యేక క్యాలెండర్ రూపొందించుకోండి. లేదా టైమ్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకంగా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయం తీసుకోవచ్చు.
*⏱️ప్రాధాన్యతలు గుర్తించండి⏱️*
👉ఏయే పనులు చేయాలో జాబితా సిద్ధం చేసుకున్న తర్వాత వాటిలో ప్రాధాన్యత ఉన్నవి, ముఖ్యంగా చేయాల్సిన పనులను గుర్తించండి. మీరు రూపొందించుకున్న షెడ్యూల్‌లో చేయాల్సిన పనుల్లో ప్రాధాన్యతలు గుర్తించినప్పుడే మీరు సగం విజయం సాధించినట్లు. మీరు చేయబోయే పనుల్ని ‘ముఖ్యం’, ‘ముఖ్యమే కానీ, తొందరలేదు’, ముఖ్యమైనది కాదు.. కానీ అత్యవసరం’, ‘ముఖ్యమైనది కాదు.. అత్యవసరం కాదు’ ఇలా విభజించుకోవాలి. మీ పనుల్ని ఈ రకంగా మార్చుకుంటే ఏ పని ముందు చేయాలి? ఏది తర్వాత చేయొచ్చు అనే అవగాహన మీకు వస్తుంది.
*⏱️పనికి పట్టే సమయం ఎంత?⏱️_* _👉ఒక పని నిమిషంలో పూర్తి కావొచ్చు.. మరో పనికి గంటలు పట్టొచ్చు. అందుకే జాబితాలోని పనులకు పట్టే సమయాన్ని ముందుగానే అంచనా వేయాలి. మీ సమయాన్ని బట్టి ఏ పనిని, ఏ సమయంలో, ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరో లెక్కగట్టండి. దానికి తగ్గట్టు ముందుకెళ్లండి._ *_⏱️కొంత ఖాళీ సమయం కేటాయించండి⏱️_*
👉ఎన్ని పనులున్నా.. వాటికి ఎంత సమయం కేటాయించినా.. కాస్త ఖాళీ సమయం ఉండేలా చేసుకోండి. ఎందుకంటే మీరు షెడ్యూల్‌ను అనుసరిస్తూ పనిలో పడి మీ వ్యక్తిగత సమయాన్ని మర్చిపోయే అవకాశముంది. అందుకే ఈ ఖాళీ సమయాన్ని మీ వ్యక్తిగతానికి ఉపయోగించుకోవచ్చు. లేదా ఆకస్మాత్తుగా ఎదైనా పని పడితే.. దాన్ని ఈ ఖాళీ సమయంలో పూర్తి చేసే అవకాశం లభిస్తుంది.
*_⏱️మీ షెడ్యూల్‌ను విశ్లేషించుకోండి⏱️_*
👉మొదటిసారే మీరు రూపొందించుకున్న షెడ్యూల్ విజయవంతంగా పూర్తి కాకపోవచ్చు. కానీ, సమయపాలన అలవాటు చేసుకోండి. అప్పుడప్పుడు మీరు వేసుకున్న షెడ్యూల్‌ను విశ్లేషించుకోండి. ఎక్కడ సమయం వృథా అవుతోంది?ప్రాధాన్యత గుర్తింపులో లోపాలు సరిదిద్దుకోండి. ఇలా ప్రణాళిక వేసుకుంటూ సమయపాలన పాటిస్తే.. వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సులభంగా సమన్వయం చేసుకోవచ్చు._