ఆ హీరో తో మావయ్య అని పిలిపించుకోవలనుకుంటున్న దర్శకుడు…!!

mahjesh raga

ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు ఆ హీరో ని మావయ్య అని పిలవమన్నాడు.

👉విషయం లోకి వెళ్తే : ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ విజయవాడలోని సిద్ధార్ధ కళాశాలలో ఘనంగా జరిగింది. మహేశ్‌బాబు, నటుడు అల్లరి నరేష్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, కథానాయిక పూజా హెగ్డే, నిర్మాతలు దిల్‌రాజు, అశ్విని దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హజరైన ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘కృష్ణ, మహేశ్‌ అభిమానులకు ఇవాళ పెద్ద పండుగ. మీకు అందరికీ ఒక్క పండుగ అయితే.. మహేశ్‌కు ఇది 25వ సినిమా కాబట్టి.. 25 పండుగలు ఒకేసారి చేసుకున్నట్లు. నిర్మాతలు దత్‌, దిల్‌రాజు, ప్రసాద్‌కు శుభాకాంక్షలు. మహేశ్‌.. మీ నాన్న గారు 25 సినిమాల సందర్భంగా ఈ రోజు నిన్ను చూసి ఎంత ఆనందపడుతున్నాడో.. నేను 100 సినిమాలు తీసినప్పుడు ఎంత ఆనందపడ్డానో.. ఇప్పుడు అంత సంతోషపడుతున్నా. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా. వంశీ.. నువ్వు చేసిన ఈ ప్రయత్నం ప్రజలకు, సమాజానికి కూడా ఉపయోగపడేలా ఉంది. మహేశ్‌ను సీఈవోగా, రైతుగా, రుషిగా చూపించావు. సంపాదించింది చివరికి రైతుకు ఇవ్వాలనే సందేశాన్ని అద్భుతంగా చెప్పావు. దేవిశ్రీ అద్భుతమైన సంగీతం అందించారు. పూజా హెగ్డే గొప్పగా నటించావు. నేను ఆ రోజే చెప్పా.. నువ్వు పెద్ద హీరోయిన్‌ అవుతావని. నరేష్‌ కామెడీనే కాదు సీరియస్‌ పాత్రలు కూడా చేస్తావని నిరూపించావు. మీ నాన్న ఉంటే చాలా సంతోషించేవారు’.

‘మహేశ్‌ హీరోగా మొదటి సినిమా ‘రాజకుమారుడు’.. సూపర్‌స్టార్‌ కృష్ణ నిర్మాత దత్ ప్రొడక్షన్‌లో చేయమన్నారు. ఆ సినిమాలో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌. మహేశ్‌ నిన్ను నేను పరిచయం చేయడం గర్వంగా ఉంది. ఏప్రిల్‌ 28న వచ్చిన ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ రికార్డులు సృష్టించాయి. మే 9న వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’, ‘మహర్షి’ హిట్‌ అయ్యాయి. ఇక నుంచి మే 9ని ‘మహర్షి’ డేగా పిలుస్తారు. ఈ ప్రయాణం ఇంతటితో ఆగదు. 👉మహేశ్‌.. కి చిన్న విన్నపం. ; ‘రాజకుమారుడు’ షూట్‌లో నన్ను మామయ్య, మామయ్య అనేవాడివి. ఇప్పుడు నువ్వు వేదికపైకి వస్తావు, నాకు ధన్యవాదాలు చెబుతావు. నన్ను రాఘవేంద్రరావు గారు అనొద్దు.. మామయ్య అను’ అని రాఘవేంద్రరావు అన్నారు.ఇకనేం “మామ -అల్లుడు”అని సినిమా తీసెయ్యండి అంటున్నారు చూసిన వారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights