థియేటర్లలో అట్టర్ ప్లాప్.. 235 కోట్లు పెడితే 68 కోట్ల కలెక్షన్స్.. నిర్మాత చేసిన పని చూస్తే.

ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల హవా పెరిగింది.. భాషతో సంబంధం లేకుండా కోట్లు వెచ్చించి మరీ సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. మరికొన్ని నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా అదే.
కంటెంట్ బలంగా ఉంటే చాలా స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా జనాలు క్యూ కట్టేస్తారు. కథ, కథనం నచ్చితే చిన్న సినిమాలు సైతం భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. కానీ కొన్నిసార్లు కోట్లు వెచ్చించి తీసే సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం భారతీయ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్. రూ. 235 కోట్లు పెడితే కేవలం రూ.68 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే మైదాన్. గత ఏడాది ఏప్రిల్‌లో అజయ్ దేవ్‌గన్ నటించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 2019లో షూటింగ్ స్టార్ట్ అయి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. మొదట్లో రూ. 120 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమా బడ్జెట్ రూ. 210 కోట్లకు పెరిగింది.
గతంలో కోమల్ నాథ్ తో జరిగిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. మైదాన్‌లో నేను డబ్బు కోల్పోయాను. COVID-19 మహమ్మారి కారణంగా ఈ చిత్రం నాలుగు సంవత్సరాలకు పైగా నిలిచిపోయింది. మహమ్మారి రాకముందే, జనవరి 2020 నాటికి దాదాపు 70% చిత్రం పూర్తయింది. మార్చి చివరి వారం నుండి మేము మ్యాచ్‌లను చిత్రీకరించాల్సి ఉంది. అన్ని అంతర్జాతీయ జట్లు వచ్చాయి. విదేశాల నుండి దాదాపు 200 నుండి 250 మందితో కూడిన సిబ్బంది ఉన్నారు అని చెప్పుకొచ్చారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
