Mega DSC Final List: అలర్ట్.. మెగా డీఎస్సీ -2025 తుది జాబితా విడుదల.. డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేసుకోండి

మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 పోస్ట్‌లకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. మెగా డీఎస్సీ పరీక్షల అనంతరం.. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేసిన ప్రభుత్వం, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది.. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది.. మొత్తం ప్రక్రియ అనంతరం డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 పోస్ట్‌లకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. మెగా డీఎస్సీ పరీక్షల అనంతరం.. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేసిన ప్రభుత్వం, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది.. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది.. మొత్తం ప్రక్రియ అనంతరం డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్పీ అధికారిక వెబ్‌సైట్‌లో తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది.. 16,347 పోస్ట్ లకు ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
డీఎస్సీ తుది జాబితా కోసం డైరెక్ట్ గా ఈ లింకును క్లిక్ చేయండి..
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరిందని పేర్కొన్నారు. ఈ మైలురాయి బాధ్యతను మరింత పెంచిందన్నారు. హామీ ఇచ్చినట్టుగా ప్రతిఏటా డీఎస్సీ నిర్వహిస్తామని.. ఈసారి రాలేకపోయినవారు నిరుత్సాహపడొద్దని లోకేశ్ సూచించారు.
మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా.. జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్ కార్యాలయాలలో, అలాగే మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుందని అధికారులు తెలిపారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
